నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

నవతెలంగాణ – నాగ‌ర్‌క‌ర్నూల్: నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. తెలంగాణ త‌ల్లికి పూల‌మాల వేసి దండం పెట్టారు. పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి, జైపాల్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు. రూ.52 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌, రూ.35 కోట్లతో చేపట్టిన పోలీసు భవన సముదాయాల‌ను కేసీఆర్ మ‌రికాసేప‌ట్లో ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం వెల‌మ ఫంక్ష‌న్ హాల్ స‌మీపంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

Spread the love