అప్పలాయగుంటలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

నవతెలంగాణ – తిరుపతి: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం స్వామివారు సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారని టీటీడీ అర్చకులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు బుధవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. అదేవిధంగా నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు త్రివిక్రమ అలంకారంలోని శ్రీ మహావిష్ణువు రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉత్సవాల విశిష్టతను వివరించారు. భక్తులను సన్మార్గంలో నడిపించేందుకు సూర్యప్రభ వాహనంపై త్రివిక్రమ అవతారంలోస్వామివారు దర్శనమిచ్చారని చెప్పారు.

Spread the love