నేడు తెలంగాణకు జేపీ నడ్డా

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పార్టీ చాలా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణకు రానున్నారు. సాయంత్రం నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మోదీ సర్కారు విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు కేసీఆర్ వైఫల్యాలను ఎండగడతారని బిజెపి నాయకులు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ‘సంపర్క్ సే సమర్థన్’ లో భాగంగా ఈ మధ్యాహ్నం ప్రో నాగేశ్వర్, పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ ను నడ్డా కలవనున్నారు. ఇది ఇలా ఉండగా, బీజేపీ అధిష్టానానికి ఈటల రాజేందర్‌, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. తమకు ఏ పదవులు అవసరం లేదని బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తమ అభిప్రాయాలు, సూచనలు అధిష్టానానికి చెప్పమన్నారు.

Spread the love