రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ…

నవతెలంగాణ – పశ్చిమబెంగాల్‌
ఒడిశాలో రైళ్లు ఢీకొన్న ప్రమాదం ఘటనను మరిచిపోకముందే పశ్చిమబెంగాల్‌ ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్ల ఢీకొనడం వల్ల 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ బంకురాలో జరిగింది. ఒండా స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు లోకో పైలట్ కి స్వల్పగాయాలయ్యాయి. రైల్వే అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. రెండు ఖాళీ గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయని, ప్రమాదానికి కాణం ఏమిటి..? రెండు రైళ్లు ఎలా ఢీకొన్నాయనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రమాదంలో ఆద్రా డివిజన్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పశ్చిమ బెంగాల్ లోని నాలు జిల్లాలకు రైల్వే సేవలు నిలిచిపోయాయి. పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురూలియా మరియు బుర్ద్వాన్, జార్ఖండ్‌లోని మూడు జిల్లాలు ధన్‌బాద్, బొకారో మరియు సింగ్‌భూమ్ ఆగ్నేయ రైల్వే పరిధిలోకి వస్తుంది.

Spread the love