భవిష్యత్‌కు బాట ‘పాలెం డిగ్రీ కళాశాల’

– అతిరథులను అందించిన కళాశాల పాలెం
– శ్రీ వెంకటేశ్వర సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల పాలెం
– విద్యార్థుల భవిష్యత్తు బాటకు మార్గం
వివిధ కళాశాలలో, పాఠశాలలో అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా,లెక్చరర్స్‌ గా, సైంటిస్టులుగా, కవులు, రచయితలు, జర్నలిస్టులు, రాజకీయవేత్తలుగా మొదలైన పలు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం జరిగింది. ఈ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు అందించింది. నేటికీ అందిస్తూనే ఉంది. ఇరు రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాసంస్థగా గుర్తింపు ఉంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో న్యాక్‌ లో బి.ప్లస్‌ గ్రేడును సాధించి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే మూడవ స్థానంలోను, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన ఏకైక కళాశాల.
నవతెలంగాణ- బిజినేపల్లి
నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 1963లో పాలెం విద్యాప్రధాత స్వర్గీయ తోట పల్లి సుబ్రహ్మణ్యం ఆరు దశాబ్దాల క్రిందట స్థాపిం చారు. శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళా శాలలో చదువుకున్న వేల మంది విద్యార్థులు విశ్వవిద్యాల యాల్లో ఆచార్యులుగా, వివిధ కళాశాలలో, పాఠశాలలో అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా,లెక్చరర్స్‌ గా, సైంటిస్టు లుగా, కవులు, రచయితలు, జర్నలిస్టులు, రాజకీయ వేత్త లుగా మొదలైన పలు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం జరిగింది. ఈ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి ఒక ఉజ్వల మైన భవిష్యత్తు అందించింది. నేటికీ అందిస్తూనే ఉంది. ఇరు రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన విద్యాసంస్థగా గుర్తింపు ఉంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో న్యాక్‌ లో బి.ప్లస్‌ గ్రేడును సాధించి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే మూడవ స్థానంలోను, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన ఏకైక కళాశాల. ఎన్‌ఎస్‌ఎస్‌ రెండు యూనిట్లు కలిగి టిఎస్‌ కెసి ,కంప్యూటర్‌ విజ్ఞుల చేత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ అభివృద్ధి చేస్తున్న విద్యాసంస్థ.పీజీ,బీఈడీ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణ తరగతులను నిర్వహించి పేరు గాంచిన కేంద్రం. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలలో అత్యుత్తమ ర్యాంకులను సాధింప చేస్తున్న కళాశాల.అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలలో నిర్వహించే యువతరంగం, జిజ్ఞాస మొదలైన కార్యక్ర మాలల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి అవార్డులను పురస్కారాలను కైవసం చేయిస్తున్న కళాశాలగా గుర్తింపు ఉన్నది. కళాశాలలో డబ్ల్యూ ఈ సి, ఆర్‌ ఆర్‌ సి, కెరీర్‌ గైడెన్స్‌, జాబ్‌ డ్రైవ్స్‌ మరియు ప్లేస్‌ మెంట్‌ అందిస్తూ విద్యార్థుల లక్ష్యాలను నెరవేరుస్తున్న కళాశాల.ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలతో పాటు వంద శాతం ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల.
కళాశాల ప్రత్యేకతలు
విశాలమైన తరగతి గదులు నెట్‌, సెట్‌, పీహెచ్‌ డీ, విద్యార్హతలతో పాటు బోధనా అనుభవం కలిగిన అధ్యాపక బృందం,దాదాపు 30 వేలకు పైగా పుస్తకాలను కలిగిన అత్యాధునిక గ్రంథాలయం, విశాలమైన సైన్స్‌ ల్యాబ్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌ లు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ఆయా సెమిస్టర్‌ ఉత్తమ ఫలితాలను కనబరిచిన విద్యార్థులకు డబ్బు రూపేన బహుమతులు (ప్రైజ్‌ మణి)ఇవ్వడం జరుగుతుంది. స్పోకెన్‌ ఇంగ్లీష్‌, సంస్కృతం తరగతుల నిర్వహణ, తెలంగాణ రాష్ట్రము అందిస్తున్న స్కాలర్‌ఫిప్‌, హాస్టల్‌ వసతి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ సాంకేతిక పరికరాలతో పాటు డిజిటల్‌ విద్యాబోధన జరుగుతున్నది. ప్రతి క్లాస్‌ రూముకు ఒక ప్రాజెక్టర్‌ వున్నది.వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యక్షంగా సాంకేతిక పరికరాలతో పాటు డిజిటల్‌ విద్యా, టిఎస్‌కేసి, కంప్యూటర్‌ మెంటర్స్‌ చేత విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, సాఫ్ట్‌ స్కిల్స్‌ నిర్వహణ, విద్యార్థులకు శారీరక వ్యాయామ కేంద్రం సుశాలమైన ఆటస్థలం వున్న ఏకైక కళాశాల పాలెం విద్యా సంస్థ.ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇరు ప్రాంతాల విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌. విద్యారాణి కోరారు.
దోస్త్‌ (అడ్మీషన్‌) ప్రక్రియ జరుగుతుంది
పాలెం డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న బీఏ (ఎల్‌ )తెలుగు, బీఏ( హెచ్‌ఇపి), బీఎస్సీ ( ఎంపీసీ, ఎంపీసీఎస్‌, బిజడ్సి, బిజడ్సిఎస్‌) కోర్సులందు డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన 2022- 23 విద్యా సంవత్సరం విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందుటకు డిగ్రీ ఆన్లైన్‌ సర్వీస్‌ తెలంగాణ దోస్త్‌ వెబ్సైట్లో అడ్మిషన్‌ చేసుకోగలరు. .దోస్తు మొదటి విడుత సీట్లు పొంది కళాశాల అందిస్తున్న వసతులను సౌకర్యాలను అన్నింటిని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి దోస్త్‌ మొదటి ఫేస్‌ అప్లికేషన్లు జూన్‌ 10 వరకు గడువు ఉన్నది.
ఎస్‌.విద్యారాణి,కళాశాల ప్రిన్సిపాల్‌

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సైన్స్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి
శ్రీ వెంకటేశ్వర సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల పాలెంలో నేను ఇంటర్‌ డిగ్రీ చదువులు చదువుకోవడం జరిగింది.
ఈ కళాశాల పేద విద్యార్థులకు మరియు దూర ప్రాంత నుండి వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలను అందించిన కళాశాల పాలెం.
నేను ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌ సైన్స్‌ టీచర్‌ గా ప్రభుత్వ పాఠశాలలో బోధనను అందిస్తున్నాను.
నా ఎదుగుదలకు ఆనాటి మా కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతోనే నేను నేడు ఈ స్థాయిలో ఉంటున్నాను.ఈ కళాశాలలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు మాథ్స్‌ సైన్స్‌ సోసియాలజీ బాటని బయోలాజికల్‌ మొదలగు కోర్సులు ఉంటే విద్యార్థుల జీవన ఉపాధి అవకాశాలుకు ఉపయోగపడతాయి.
పూర్వ విద్యార్థి
కే సుమన్‌ మహారాజ్‌ సైన్స్‌ టీచర్‌.
M.Sc(phy),M.Sc(maths).M.Sc(Psy),
M.A(phil),M.Ed

ఉన్నత స్థాయిలో స్థిరపడ్డాను
ఈకళాశాలలో ఎంతో మంది పేద విద్యా ర్థులు చదువుకొని మంచి ఉద్యోగా లతో స్థిరపడి విదేశాలలో వివిధ రంగా లలో ఉన్నత స్థాయిలో స్థిర పడ్డారు మాకు ఈ కళాశాల వ్యవస్థాప కులు విద్యాప్రదాత శ్రీ తోటపల్లి సుబ్బయ్యకు మా కృతజ్ఞతలు.
పూర్వ విద్యార్థి. సందు యాదగిరి,జర్నలిస్ట్‌

Spread the love