తెలంగాణలో విద్యుత్‌ రంగం-తీరుతెన్నులు

Power Sector in Telangana - Coastal Ferriesతెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2న ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విద్యుత్‌ రంగం ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలతో సహా గణనీయంగా విస్తరించింది. వినియోగదారుల సంఖ్య, మొత్తం విద్యుత్‌ వినియోగం, తలసరి వినియోగం గణనీయంగా పెరిగాయి. విద్యుత్‌ ఉత్పత్తి స్థాపక సామర్ధ్యం 7778 మెగావాట్ల నుండి 2022 మార్చి చివరి నాటికి 17228 మె.వా.కు పెరిగింది. అత్యధిక డిమాండు 5661 మె.వా. నుండి 16638 మె.వా.కు పెరుగుతుందని తాజా అంచనా. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యుత్‌ కొనుగోలు వ్యయం ఏ టేటా పెరిగిపోతున్నది. దీనికితోడు. కొంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల, విద్యుత్‌ సంస్థల నిర్వహణలో లోటుపాట్ల వల్ల వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా జరిగే వరకు అయ్యే వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌) పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (టిఎస్‌ఈఆర్సీ) 2023-24 సంవత్సరానికి రెండు విద్యుత్‌ పంపిణీ కంపెనీలు ఎస్‌పిడిసిఎల్‌, ఎన్‌పిడిసిఎల్‌లకు కలిపి నిర్థారించిన రెవెన్యూ లోటును, 2016-17 నుండి 2022-23 వరకు ట్రూ అప్‌ క్లెయిముల మొత్తాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించటంతో వినియోగదారులపై కొత్త భారాల ముప్పు తప్పింది. రెవెన్యూ లోటు రూ.9124. 82 కోట్లు, ట్రూ అప్‌ క్లెయిములు రూ.12514.57 కోట్ల మేరకు భరించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంగీకరించింది. 2022-23 సంవత్సరానికి అసాధారణంగా రూ.6078.73 కోట్ల మేరకు చార్జీల పెంపుదల భారం పడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సర చార్జీల ఉత్తర్వులో రెవెన్యూ లోటు, పేరుకుపోయిన ట్రూ అప్‌ క్లెయిముల భారం కలిపి రూ.21,639.39 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా సమకూర్చడం రాష్ట్ర చరిత్రలోనే అసాధారణం.
భారీగా మిగులు విద్యుత్‌, అయినా మార్కెట్‌ కొనుగోళ్ల అవసరం
అయిదవ నియంత్రణా కాలం (2024-25 నుండి 2028-29 వరకు) భారీగా విద్యుత్‌ మిగులు ఉంటుందని పంపిణీ కంపెనీలు తాజా అంచనాలలో చూపాయి. 2024-25లో 36758 మిలియన్‌ యూనిట్లు, 2025-26లో 37683 మి.యూ., 2026-27లో 32352 మి.యూ., 2027-28లో 26374 మి.యూ., 2028-29లో 16133 మి.యూ. మిగులు ఉంటుందని అంచనా చూపాయి. అయినా కూడా, పీక్‌ సమయాలలో డిమాండు తీర్చేందుకు మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాయి. రోజువారీగా, సీజన్‌ వారీగా డిమాండులో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల, వివిధ రకాల విద్యుత్‌ ఉత్పత్తి అవకాశాలు, పరిమితుల వల్ల, వివిధ సమయాలలో మిగులు, కొరత ఉంటాయి. ఈ మిగులు సాధ్యమైనంత తక్కువగా ఉండేటట్లు వివిధ రకాల విద్యుత్‌ మిశ్రమంలో సాధ్యమైనంత మేరకు సమతూకం ఉండేటట్లు చూడాలి. కాని డిస్కాంలు చూపిన అంచనాల ప్రకారం విద్యుత్‌ అవసరాలలో 25 నుండి 40శాతం వరకు మిగులు విద్యుత్‌ అయిదవ నియంత్రణా కాలంలో ఉంటుంది. డిమాండ్‌లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా జరిగేందుకు రిజర్వ్‌ మార్జిన్‌ లేదా స్పిన్నింగ్‌ రిజర్వ్‌ నిమిత్తం 5శాతం మిగులు ఉంటే సరిపోతుంది. అయిదవ నియంత్రణ కాలంలో తేలుతుందని అంచనా వేసిన మిగులు విద్యుత్‌ ఇప్పటికే అమలైన, అమలులో ఉన్న ప్రాజెక్టులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్కాంలు చేసుకున్న, చేసుకోనున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పిపిఏలు) కారణంగానే తేలుతుంది. ఆ విధంగా పరిస్థితిని సరిదిద్దలేని విధంగా భారీ మిగులు విద్యుత్‌ లభించటం, దాని వల్ల వినియోగదారులపై పడే అదనపు భారాల, ఇతర సాంకేేతిక సమస్యలు కూడా వచ్చే ఐదేండ్లలో కొనసాగుతాయి. ఇంత భారీగా మిగులు విద్యుత్‌ తేలటం వల్ల దానిని కనీసం లాభనష్టాలు లేని విధంగా మార్కెట్‌లో అమ్మటం సాధ్యం కాదని అనుభవం నిర్థారిస్తున్నది. కమిషన్‌ ఆదేశాల మేరకు డిస్కాంలు అనుసరించాల్సిన మెరిట్‌ ఆర్డర్‌ సూత్రం ప్రకారం అత్యధిక అస్థిర ఛార్జీలు ఉన్న విద్యుత్తే మిగులు విద్యుత్‌ తేలుతుంది. దీనివల్ల, మిగులు విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాలని ధర్యల్‌ ప్రాజెక్టు లను, ముఖ్యంగా టీఎస్‌జెన్‌కో ప్రాజెక్టులను ఆదేశిస్తూ, అలా చేయని ఉత్పత్తికి కూడా పిపిఎలలోని షరతుల ప్రకారం భారీగా స్థిరఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది. ఆ భారాలన్నీ వినియోగ దారులపైనే పడతాయి. మరోపక్క పీక్‌ డిమాండు తీర్చేందుకు చాలా అధిక ధరకు మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిస్కాంలు 96553.85 మిలియన్‌ యూనిట్ల లభ్యత, 83113మి.యూ. అవసరం, 13441మి.యూ. మిగులు విద్యుత్‌ ఉంటాయని తొలుత ప్రతిపాదించాయి. అయితే, విద్యుత్‌ లభ్యతను 92665.57 మి.యూ.గా, అవసరాన్ని 84156.35మి.యూ. గా, మిగులును 8509.22మి.యూ.గా విద్యుత్‌ చార్జీల ఉత్తర్వులో కమిషన్‌ నిర్ధారించింది. డిస్కాములు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాన్ని రూ.54058.35 కోట్ల నుండి రూ.52006.78 కోట్లకు కమిషన్‌ తగ్గించింది. మిగులు విద్యుత్‌ భారీగా అభిస్తుందని అంచనా వేసి, 2023-24లో మార్కెట్‌లో 135.56 మీ.యూ. కొనాల్సి వస్తుందని డిస్కాములు వేసిన అంచనాను కమిషన్‌ 1505.42మి.యూ.కు పెంచింది. ఈ మార్కెట్‌ కొనుగోళ్ళకు యూనిట్‌ ధరను సగటున రూ.3.50 చొప్పున కమిషన్‌ లెక్కగట్టింది. మిగులు విద్యుత్‌లో 3724.05 మీ.యూ.లను యూనిట్‌కు సగటున రూ.5 చొప్పున అమ్మాలని కమిషన్‌ డిస్కాంలను ఆదేశించింది. ఆ మేరకు లభించే ఆదాయం రూ.1862.02 కోట్లను మొత్తం విద్యుత్‌ కొనుగోలు వ్యయం నుంచి తగ్గించింది. కమిషన్‌ నిర్థారించిన వివిధ అంశాల అంచనాలలో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశా లున్నాయి. అలా జరిగినప్పుడు వినియోగదారులపై ట్రూ అప్‌ భారాలు పడతాయి. భారీగా మిగులు విద్యుత్‌ తేలటం, అదే సమయంలో పీక్‌ కొరతను తీర్చేందుకు మార్కెట్లో విద్యుత్‌ కొనాల్సి రావటం విద్యుత్‌ కొనుగోళ్ళకు దీర్ఘకాలిక పిపిఎలు చేసుకొని, కమిషన్‌ అనుమతులను పొందటంలో విచక్షణా రాహిత్యాన్ని నిర్థారిస్తున్నది. సాంకేతికంగా నివారించలేని మిగులు కన్నా చాలా అధికంగా మిగులు తేలి వినియోగదారులపై అనవసర భారాలు మోపడానికి ఈ అనుచిత నిర్ణయాలు దారితీస్తున్నాయి.
ట్రూ అప్‌ భారాలకు కారణాలు
కమిషన్‌ నిర్ధారించిన దానికి మించి మిగులు విద్యుత్‌ తేలితే, దానిని కనీసం లాభనష్టాలు లేకుంగా మార్కెట్లో డిస్కాంలు అమ్మలేకపోతే, ఆమేరకు ఉత్పత్తి తగ్గించాలని సంబంధిత ప్రాజెక్టులను ఆదేశించి, అందుకు స్థిర చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. ఆ మేరకు వినియోగదారులపై ట్రూ అప్‌ భారాలు పడతాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సిఎసిపిడిసిఎల్‌ (1000 మె.వా.) నుండి డిస్కాంలు ప్రతిపాదించిన 6824.73మి.యూ. లభిస్తుందని కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. ఈ విద్యుత్‌కు చెల్లించాల్సిన చార్జీలపై న్యాయపరమైన వివాదం కొనసాగు తుండటం, సరఫరా చేసిన విద్యుత్‌ తెలంగాణ డిస్కాంలు భారీగా బకాయిలు పడటంతో సిఎస్పిడిసిఎల్‌ గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుండి విద్యుత్‌ సరఫరా నిలిపి వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే పరిస్థితి కొనసాగితే, మిగులు విద్యుత్‌ను దాని బదులు వాడుకొనే వీలుంటే, మిగులు విద్యుత్‌ లభ్యత, చేయని ఉత్పత్తికి స్థిర చార్జీల చెల్లింపు తగ్గుతాయి. మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు అవసరం తగ్గవచ్చు. అధిక అస్థిర చార్జీలతో సిఎస్‌ పిడిసిఎల్‌ విద్యుత్‌లో కొంత భాగం ఇప్పటికే మిగులు విద్యుత్‌లో చేరి ఉంటే, మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు అవసరం పెరగవచ్చు. సిఎస్‌ పిడిసిఎల్‌లో కొనసాగుతున్న వివాదంలో అంతిమ తీర్పును బట్టి వినియోగదారులపై అదనపు భారాలు పడతాయా లేదా అనేది తేలుతుంది. 2022-23లో డిస్కాంలు మార్కెట్‌లో 3616 మి.యూ. కొనాల్సి వచ్చింది. 2023-24లో 1505.42మి.యూ. విద్యుత్‌ను యూనిట్‌కు రూ.3.50 చొప్పున మార్కెట్లలో కొనాలని కమిషన్‌ వేసిన అంచనా అవాస్తవికమైనది. దానికి ప్రాతిపదిక ఏమిటో చార్జీల ఉత్తర్వులో వివరించలేదు. ఏప్రిల్‌ 2023లో 997.14మి.యూ., మార్చి 2024లో 618.28మి.యూ.ను అలా కొనాలని అంచనా వేసింది. వేసవి పీక్‌ సీజన్‌లో మార్కెట్‌లో అంత తక్కువ ధరకు విద్యుత్‌ లభించదు. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్ళకు చాలా అధిక ఛార్జీలను చెల్లించాల్సి వచ్చింది. బొగ్గుకు కృత్రిమ కొరత, విదేశీ బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి, విద్యుత్‌ ఎక్ఛేంజిలలో కొరత పరిస్థితుల్లో చట్టబద్ద నల్లబజారు వ్యాపారం నడుస్తున్న రీత్యా ప్రస్థుత ఆర్థిక సంవత్సరంలో కూడా మార్కెట్‌లో ముఖ్యంగా పీక్‌ సీజన్లలో విద్యుత్‌ కొనుగోలుకు అధిక ధరలను చెల్లించాల్సి రావచ్చు. ఆ విధంగా కమిషన్‌ నిర్ణంయిం చిన ధరకు మించి, పరిమాణానికి మించి మార్కెట్‌లో విద్యుత్‌ కొన్న మేరకు వినియోగదారులపై ట్రూ అప్‌ భారాలు పడతాయి. కేంద్రం అనుసరిస్తున్న, కొత్తగా రాష్ట్రాలపై మోపుతున్న విధానల వల్ల కూడా విద్యుత్‌ కొనుగోలు వ్యయం కమిషన్‌ అంచనాలకు మించి పెరగవచ్చు.
కమిషన్‌ నిర్ణయించిన మేరకు, నిర్ణయించిన ధరకు డిస్కాంలు మిగులు విద్యుత్‌ను అమ్మలేకపోతున్నాయి. 2022-23లో 5059.81మి.యూ. మిగులు విద్యుత్ను అమ్మాలని కమిషన్‌ నిర్దేశించగా, డిస్కాంలు 1674మి.యూ. మాత్రమే అమ్మగలి గాయి. 2023-24 సంవత్సరానికి మిగులు విద్యుత్‌ను నష్టపడ కుండా అమ్మలేమని, డిస్కాంలు మిగులు విద్యుత్‌ అమ్మే ప్రతిపాదన కూడా చేయలేదు. మిగులు విద్యుత్‌ అధిక అస్థిర చార్జీలతో కూడుకున్నది. పీక్‌ కాని సమయాలలో లభ్యమయ్యేది. అందువల్ల కమిషన్‌ నిర్ణయించిన విధంగా యూనిట్‌కు రూ.5చొప్పున అలాంటి మిగులు రైలు విద్యుత్‌ను అమ్మటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కమిషన్‌ నిర్ణయించిన పరిమాణంలో యూనిట్‌ రూ.5 చొప్పున డిస్కాంలు మిగులు విద్యుత్‌ను అమ్మలేని మేరకు వచ్చే తేడా మొత్తం ట్రూ అప్‌ భారంగా వినియోగదారులపై పడుతుంది. మార్కెట్‌ కొనుగోళ్ళు, మిగులు విద్యుత్‌ అమ్మకానికి సంబంధించి కమిషన్‌ అవాస్తవిక అంచనాలు వేయటం వల్ల, డిస్కాంల రెవెన్యూ లోటు తక్కువగా చూపబడి, ఆ మేరకు ప్రభుత్వం ఇచ్చివుండాల్సిన సబ్సిడీ తగ్గింది. అలా తగ్గిన మొత్తాన్ని వినియోగదారుల ట్రూఅప్‌ చెల్లించాల్సి వస్తుంది.
నిర్ణీత గడువులో అమలుకాని ఎత్తిపోతల పధకాలు – తగ్గుతున్న విద్యుత్‌ విక్రయాలు
2022-23లో కమిషన్‌ 69237.14 మి.యూ. మేరకు విక్రయాల అవసరాన్ని నిర్థారించగా, డిస్కాంలు 64308.27 మి.యూ. మేరకే విక్రయించ గలిగాయి. 4929మి.యూ. మేరకు విక్రయాలు తగ్గడానికి ప్రధాన కారణం నీటిపారుదల, ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ ప్రతిపాదించిన విధంగా ఎత్తిపోతల పధకాలు అమలు కాక పోవటమే. హెచ్‌ఐ కేటగిరీలో ఎత్తిపోతల పధకాలకు, వ్యవసాయానికి 2022-23లో 3312.01వి.ఎ.యూ. మాత్రమే అవసరమని డిస్కాంలు సాగునీటి పారుదల శాఖ చూపిన అవసరాలలో 50శాతం లోడ్‌ ఫాక్టరీనే పరిగణన లోకి తీసుకుని చూపాయి. 2023-24లో ఈ అవసరం 8084.26 మి.యూ.కు పెరుగుతుందని చూపాయి. అంటే దాదాపు 144శాతం పెరుగుదల. సాగునీటి పథకాల అమలులో దీర్ఘకాలిక జాప్యం జరగటం సర్వసాధారణం అని అనుభవం నిర్థారిస్తున్నది. డిస్కాంల అంచనాల ప్రకారం ఎత్తిపోతల పధకాలకు విద్యుత్‌ వినియోగం పెరగకపోతే, ఆ మేరకు మిగులు విద్యుత్‌ పెరుగుతుంది. ఆ మిగులు విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించి, ఆమేరకు స్థిర చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. ఆ భారం ట్రూ అప్‌ కింద వియోగదారులపై పడుతుంది. 2022-23లో పునరుత్పత్తి అయ్యే విద్యుత్‌ (ఆర్మ్‌)ను అవసరాలతో నిమిత్తం లేకుండా తప్పని సరిగా కొనాల్సినప్పటికి, దానిని కొనుగోలు చేయటం కోసం ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించ లేదని డిస్కాంలు సమాధానమిచ్చాయి. 2023-24లో 11959.28 మి.యూ. ఆ లభ్యమవుతుందని కమిషన్‌ నిర్థారించింది. దీనిని కొనుగోలు చేసేందుకు ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తుంది. అందుకు చెల్లించాల్సిన స్థిర చార్జీలను కూడా కమిషన్‌ విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో చేర్చింది.
కేంద్ర విద్యుత్‌ ప్రసార సంస్థ పిజిసిఐఎలు డిస్కాంలు చెల్లించాల్సిన అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలను 2023-24కు కమిషన్‌ రూ.1533.17మేరకు అనుమతించింది. సిఇఆర్సి ఉత్తర్వు మేరకు పిజిసిఐఎల్‌ లెక్కగట్టే చార్జీలు దానికి మించి పెరిగితే, అదనపు మొత్తం ట్రూఅప్‌ కింద వినియోగదారులపై పడుతుంది. ఎన్టీపిసిసికి చెందిన టిఎస్టి టిపిపికి దాఖలు చేసిన ఇంధన వ్యయాన్ని 90శాతం మేరకే కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. ఆ ప్రాజెక్టుకు అస్థిర చార్జీలు అంతకు మించి పెరిగితే, అదనపు మొత్తం ట్రూ అప్‌ కింద వినియోగదారులు చెల్లించాల్సి వస్తుంది. సెంబ్కర్ప్‌ ప్రాజెక్టుల రెండుయూనిట్లకు 2023-24లో చెల్లించా లని డిస్కాంలు ప్రతిపాదించిన రూ.60.48 కోట్ల మొత్తాన్ని వాస్తవ వ్యయాన్ని పరిశీలించి, ట్రూ అప్‌ క్లెయిములను పరిగణించేటప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామని కమిషన్‌ పేర్కొంది. అలా జరిగితే ఆ మొత్తం కూడా ట్ర అప్‌ కింద వినియోగదారులపై పడుతుంది.
వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాపై వివాదం
అమెరికాలో తానా ఏర్పాటు చేసిన సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా, వ్యవసాయానికి రోజుకు మూడు, నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరా సరిపోతుందని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెలిబుచ్చిన అవాస్తవిక, తొందరపాటు అభిప్రాయంపై వివాదం చెలరేగింది. దీనిపై అధికార పక్షం బీఆర్‌ఎస్‌ నుండి తీవ్ర విమర్శలు వచ్చాక జరిగిన వాదోపవాదాల సందర్భంగా, తమ పార్టీ వ్యవసాయానికి రోజంతా విద్యుత్‌ సరఫరా చేసే విధానానికి వ్యతిరేకం కాదని కాంగ్రెస్‌ వివరణ ఇచ్చింది. ఈ వ్యవహారం వ్యవ సాయానికి రోజంతా ఉచిత విద్యుత్‌ సరఫరా విధానం, అమలు చర్చనీయాంశం కావటానికి దారితీసింది. వ్యవసాయానికి రోజంతా విద్యుత్‌ సరఫరా అవసరం, లేదా మూడు, నాలుగుగంటల పాటు సరఫరా సరిపోతుందనే అభిప్రాయాలు పరస్పర విరుద్ధమైనవే గాక, వాస్తవ పరిస్థితితో పొంతన లేనివి. ఏడాదిలో వ్యవసాయానికి సీజన్‌లో వేసిన పంటల ఆ వసరాలను బట్టి అవసరమైన మేరకే విద్చుత్‌ వినియోగం జరుగుతుందనేది తెలిసిన విషయమే. వ్యవసాయానికి రోజంతా విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు వాదన కోసం భావించినా, అది వాస్తవ వినియోగానికే పరిమితమవుతుంది. వినియోగం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తే అది తీవ్రమైన సాంకేతిక సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, వాస్తవ వినియోగానికి మించి వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా జరగదు. అలా జరగాల్సిన అవసరం కూడా లేదు. వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగానికి కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది. అదేవిధంగా వ్యవసాయానికి రోజుకు మూడు, నాలుగు గంటల పాటు విద్యుత్‌ సరఫరా సరిపోతుందనే అభిప్రాయం హాస్యాస్పదమైనది. వాస్త వానికి, రైతులు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇది సమంజసమైన కోరికే. రోజంతా విద్యుత్‌ సరఫరా జరుగుతుంటే, రైతులు అలా ప్రత్యేకంగా కోరాల్సిన అవసరం లేదు. సాంకేతిక కారణాల వల్లగాని, పీక్‌ సమయాలలో మార్కెట్‌లో విద్యుత్‌ లభించక గాని, కొద్దిసేపు వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా సింగిల్‌ ఫేజ్‌ సరఫరా చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతంలో దుర్భిక్ష పరిస్థితుల్లో విద్యుత్‌ సరఫరా అవసరమైన కాలంలో అవసరమైన మేరకు జరగక పైర్లు దెబ్బతినే పరిస్థితి తిరిగి తలెత్తకుండా వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.
అసమగ్ర నియంత్రణ ప్రక్రియ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కమిషన్‌ ఇచ్చిన చార్జీల ఉత్తర్వు అసమగ్రంగా ఉంది. ప్రతి ఏటా చార్జీల ఉత్తర్వులలో ఇస్తున్న అనేక వివరాలు, విశ్లేషణ ఈసారి ఉత్తర్వులో చోటు చేసుకోలేదు. డిస్కాంలు సకాలంలో తమ పిటిషన్లను, అవసరమైన పూర్తి సమాచారంతో దాఖలు చేయకపోవటం, కమిషన్‌ అదనపు వివరాలు కోరాక కూడా ఆలస్యంగా సమర్పించటం, ఎఆర్‌ఆర్‌తో పాటు ఏడేండ్లకు సంబంధించిన ట్రూ అప్‌ క్లెయిముల పిటిషన్లను కూడా ఒకేసారి దాఖలు చేయటంతో కమిషన్‌ నియంత్రణ ప్రక్రియను సకాలంలో చేపట్టి. పూర్తి చేయటం సాధ్యం కాలేదని భావించాలి. అభ్యంతరదారులు అడిగిన అవసరమైన సమాచారాన్ని కూడా డిస్కాంలు తమ సమాధానాలలో ఇవ్వకుండా దాటవేశాయి. కమిషన్‌కు ఆలస్యంగా ఇచ్చిన అదనపు సమాచారాన్ని కూడా డిస్కాంల వెబ్‌సైట్‌లో గాని, కమిషన్‌ వెబ్‌సైట్లలోగాని, చార్జీల ఉత్తర్వులోగాని చూపలేదు. ప్రభుత్వ అసంబద్ధ వైఖరి వల్ల కమిషన్‌కు తగినంత సిబ్బందిలేని లోటు కూడా కొనసాగుతున్నది. ఇన్నేళ్ల అనుభవం తరువాత కూడా డిస్కాంలు ఇలా వ్యవహరించటం, అభ్యంతరదారులు, కమిషన్‌ కూడా వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు, విశ్లేషించేందుకు అవకాశం, సమయం లేకుండా పోవడానికి దారితీసింది. చార్జీల పెంపుదల ప్రతిపాదనలు చేయించిన ప్రభుత్వం. ఎంత మేరకు సబ్సిడీ ఇచ్చేది కమిషన్‌కు తెలియజేయటంలో కూడా ఆలస్యం చేసింది. ఏప్రిల్‌ మొదటి తేదీ నుండి చార్జీల ఉత్తర్వు అమలులోకి రావాల్సిన అవసరం కూడా ఈ పరిస్థితుల్లో చార్జీల ఉత్తర్వును ఆ సమగ్రంగా తయారుచేసి, విడుదల చేయడానికి దారితీసింది. సకాలంలో, సమగ్ర వివరాలతో పిటిషన్లు దాఖలు చేయకపోవటం, అనేక పిటిషన్లను ఒకే కాలంలో దాఖలు చేయటం ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలకు పరిపాటి అయింది. కమిషన్‌ తన అధికారాన్ని వినియోగించి ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు నియంత్రణ ప్రక్రియకు సంబంధించి వాటి బాధ్యతలను సకాలంలో, సక్రమంగా పాటిం చేటట్లు, పారదర్శకత, జవాబుదారితనం ఉండేటట్లు, కమిషన్‌ ఉత్తర్వులు వివిధ అంశాలపై వాదనలతో కూడినవిగా ఉండేటట్లు చూడాల్సిన అవసరం ఉంది.
ఎం. వేణుగోపాలరావు
9441193749 

Spread the love