టీ20 ప్ర‌పంచ‌క‌ప్ భార‌త్‌దే: షోయ‌బ్ అక్త‌ర్

నవతెలంగాణ – హైదరాబాద్: ఈసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచే జ‌ట్టు విష‌య‌మై పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ త‌న యూట్యూబ్ ఛానెల్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచేందుకు వంద‌కు వంద శాతం అర్హ‌త టీమిండియాకే ఉంద‌న్నాడు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో త‌ప్ప‌కుండా భారత్‌ విజయం సాధిస్తుందని పాకిస్థాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జోస్యం చెప్పాడు. ఇక సూప‌ర్‌-8లో సెయింట్ లూసియా వేదిక‌గా జ‌రిగిన‌ త‌న ఆఖ‌రి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆస్ట్రేలియాపై అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. 24 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి గ్రూప్‌-1లో అగ్ర‌స్థానంలో నిలిచింది. దీంతో జూన్ 27న ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

Spread the love