ఏపీలో సీనియర్‌ ఐపీఎస్‌లకు షాక్‌

– వెయిటింగ్‌లో వున్నా రోజూ హెడ్‌క్వార్టర్స్‌కు రావాల్సిందే
– 16 మందికి డీజీపీ మెమో
అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్‌ ఐపీఎస్‌లకు టీడీపీ కూటమి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. డీజీ స్థాయి అధికారులైన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పివి సునీల్‌కుమార్‌, అడిషనల్‌ డిజి స్థాయిలో వున్న ఎన్‌ సంజరుతో కలిపి మొత్తం 16 మంది సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం మెమో ఇచ్చారు. వెయిటింగ్‌లో వున్నా.. ప్రతిరోజూ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు వచ్చి సంతకం చేసి ఉదయం పది నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో ఉండాలని మెమోలో పేర్కొన్నారు. సాయంత్రం రిజిష్టర్‌లో సంతకం చేసి వెళ్లాలన్నారు. కాంతి రాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, సి విజయరావు, విశాల్‌ గున్ని, రవిశంకర్‌ రెడ్డి, వై రిషాంత్‌ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్‌ రెడ్డి, పి జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, జి పాలరాజు తదితరులకు డిజిపి మెమో ఇచ్చారు. వైసిపి ప్రభుత్వంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పిఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సీఐడీ చీఫ్‌గా పివివి సునీల్‌కుమార్‌, ఎన్‌ సంజరు, సిట్‌ అధికారిగా కొల్లి రఘునాథ్‌రెడ్డి ఏకంగా చంద్రబాబుపైనే కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది.

Spread the love