టీయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల మౌన ప్రదర్శన…

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో  యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో రాష్ట్ర జాక్  పిలుపు మేరకు జాక్ కో కన్వీనర్ డాక్టర్ వి దత్త హరి ఆధ్వర్యంలో  సోమవారం కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మౌన ప్రదర్శన నిర్వహించారు. అసిస్టెంట్  ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ ల మా బాధని ముఖ్యమంత్రి అంగీకారం కనికరించి మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నామని విన్నవించారు.  జీవితంలో కొత్త క్రాంతి వెలుగుని రెగ్యులరైజ్ చేసి ఇవ్వాలని, ఇదే మ చిరుకాల వాంఛ ఉందని, రెగ్యులరైజ్ టు సర్వీస్ ఎన్నో సమస్యలకు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపారన్నరు.  ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా డాక్టర్ వి దత్త హరి జాక్ కో కన్వీనర్ మాట్లాడుతూ వినూత్న నిరసన నిర్వహించటానికి ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని 12 యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంటాక్ట్స్ ఒకే ఎజెండా కింద కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ డాక్టర్ ఆనంద్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ పద్మ, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ శ్వేత, డాక్టర్ రమ్య, డాక్టర్ రామేశ్వర్ రెడ్డి ,డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శరత్, డాక్టర్ రామలింగం, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్, డాక్టర్ శరత్, డాక్టర్ గోపి రాజ్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ సురేష్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ డానియల్, డాక్టర్ జి శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ గంగా కిషన్ పాల్గొన్నారు.
Spread the love