సైలెంటైన సోషల్ మీడియా.? 

– ఎన్నికల ప్రక్రియ పూర్తి
– సామాజిక మాధ్యమాలు నిశ్శబ్దం
నవ తెలంగాణ-మల్హర్ రావు
గత నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జిల్లాలో ఉదృతంగా కొనసాగిన ప్రచారంతోపాటు,సామాజిక మాధ్యమాల్లో కూడా ముమ్మరంగా ప్రచారం భేరి మోగించారు.సోషల్ మీడియా ఇంఛార్జీలను నియమించి మరి నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలన్నీ  మేనిపేస్టోలు,అభ్యర్థులు గుణగణాలను విస్తృతంగా ప్రచారం చేశారు.కార్యక్రమాల వివరాలను వాట్సాప్,పేస్ బుక్,ఇన్ స్ట్రా గ్రామ్ వంటి మార్గమద్యమాల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ బిజీబిజీగా గడిపారు. అయితే ఆదివారం ఫలితాలు తేటతెల్లం కావడంతో సోషల్ మీడియా స్తబ్దుగా మారింది.ఇన్ని రోజులు ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మిడియాల ఇన్ఛార్జిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం,కామెంట్ల రూపంలో వాదనలు కొనసాగడం జరిగాయి.ఒకరు పెట్టిన సోషల్ మీడియా పోస్టును ప్రత్యర్థి పార్టీలు అనుచరులు స్పందిస్తూ విమర్శల రూపంలో కామెంట్లు చేసుకున్నారు.దానికి మళ్ళీ ప్రతిస్పందనలు రావడం ఇలా వాద, ప్రతివాదనలు సోషల్ మీడియాలో జోరుగా కొనసాగాయి.ఫలితాలు వెల్లడి అనంతరం ఓటమి చెందిన అనుచర వర్గం సైలెంట్ అయిపోయింది.గెలిచిన అభ్యర్థుల అనుచరులు విజయాత్రల పేరిట అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో డిజె,సౌoడ్ బాక్సులతో మోతలు మోగించారు.గెలుచిన,ఒడినా హుందాగా ఉండటమే బెటర్ ని తటస్తులు సూచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనుచరులు, కార్యకర్తలు,యువత వివాదాలు సృష్టించుకోవద్దని కోరుతున్నారు.
Spread the love