ఆస్ర్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: ఆస్ర్టేలియన్ ఓపెన్ సూపర్-500బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి పివి సింధు ప్రవేశించగా..యువ షట్లర్ తాన్వీ శర్మ క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-6, 21-9తో చైనీస్ తైపీకి చెందిన 3వ సీడ్ చెన్-సూ-యును వరుససెట్లలో ఓడించింది.ఈ గేమ్ కేవలం 27నిమిషాల్లోనే ముగిసింది.దీంతో ముఖా ముఖి పోరులో సింధు 15-13ఆధిక్యతలో నిలిచింది.తొలి గేమ్ ను సునాయాసంగా గెలుచుకున్న సిందు..రెండో గేమ్ లోనూ ప్రత్యర్ధి చెన్ కు ఏమాత్రం అవకాశమివ్వకుండా మ్యాచ్ ను ముగించి సెమీస్ కు చేరింది. అంతకుముందు ప్రి క్వార్టర్స్ లో సింధు ఇండియాకే చెందిన ఇషారాణి బరువాను ఓడించి క్వార్టర్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే.ఇక17ఏళ్ల తాన్వీ శర్మ టాప్ సీడ్,జపాన్ కు చెందిన యమగుచి చేతిలో పోరాడి ఓడింది.హోరా హోరీగా సాగిన ఈ గేమ్ లో తాన్వీ శర్మ 14-21, 14-21తో32నిమిషాల్లో టాప్ సీడ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
సెమీస్ కు సింధు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



