Saturday, June 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగునీటి ప్రాజెక్టుల 
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

సాగునీటి ప్రాజెక్టుల 
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

- Advertisement -

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులు 
వేగవంతం చేయాలి
మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి,
దిండి ఎత్తిపోతల పథకాల పురోగతిపై సమీక్ష‍
రెవెన్యూ పునరావాసం, పున:ఉపాధి, భూసేకరణ కమిషనర్ : కె. శివకుమార్ నాయుడు


నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ పునరావాసం, పున:ఉపాధి, భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రంగారెడ్డి కలెక్టరేట్‌‌లో సమీక్షా సమావేశంలో నిర్వహించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం తదితర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతినపై ఆయనకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) అనంత్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ)తో కలిసి సమీక్షించారు. భూసేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కమిషనర్‌ ‌సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల ఆర్డీవోలు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆమనగల్లు, మాడ్గుల తహసీల్దార్లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -