థాయ్ లాండ్ ఓపెన్
బ్యాంకాక్ : థాయ్ లాండ్ ఓపెన్ సూపర్-500బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో కిదాంబి శ్రీకాంత్,లక్ష్యసేన్ శుభారంభం చేయగా..యువ షట్లర్ ఆయుశ్ శెట్టి తొలిరౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు.ఇక మహిళల సింగిల్స్ లో పివి సింధు,మాల్విక బన్సోద్,దేవిక సిహాగ్ తొలిరౌండ్ గండం గట్టెక్కి ప్రి క్వార్టర్స్ కు చేరారు.సింధు21-9, 21-12తో కేవలం 33నిమిషాల్లో చైనీస్ తైపీకి చెందిన టంగ్-సియోవో-టోంగ్ ను ఓడించింది.రెండో రౌండ్ లో డెన్మార్క్ కు చెందిన41వ ర్యాంకర్ అమేలియా షుల్జ్ తో తలపడనుంది.ఇక21ఏళ్ల దేవిక 21-19, 13-21, 21-15తో జపాన్ షట్లర్, 26వ ర్యాంకర్ నసూకి నిడైరాను ఓడించింది.ఈ పోటీ సుమారు గంటా 11నిమిషాలసేపు హోరా హోరీగా సాగింది.ఇక తన్వీ శర్మ 21-17, 21-8తో హీనా అకేచిని ఓడించి ప్రి క్వార్టర్స్ కు చేరారు.మాల్విక భారత్ కే చెందిన అన్మోల్ ఖర్బ్ ను ఓడించి టాప్ సీడ్ చెన్-యూపీ(చైనా)తో పోటీకి సిద్ధమైంది.
పురుషుల సింగిల్స్ లో ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21-16, 21-17తో43నిమిషాల్లో సింగపూర్ కు చెందిన హెంగ్ జాసన్ ను ఓడించాడు.ప్రపంచ29వ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్21-14, 21-15తో సింగపూర్ కు చెందిన లోహ్ కియాను చిత్తుచేసి ప్రి క్వార్టర్స్ లో చైనీస్ తైపీ ఆటగాడు సు-లి-యాంగ్ తో పోటీకి సిద్ధమయ్యాడు.ఇక21ఏళ్ల ఆయుష్ శెట్టి మూడు సెట్ల హోరా హోరీ పోరులో ప్రపంచ 9వ ర్యాంకర్,జపాన్ కు చెందిన నరోకా చేతిలో పోరాడి ఓడాడు.ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆయుష్ శెట్టి 13-21, 21-17, 4-21తో పరాజయాన్ని చవిచూశాడు.ఈ మ్యాచ్ సుమారు 59నిమిషాలసేపు సాగింది.



