దొరల పాలనకు చరమగీతం పాడండి

మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ
ఇచ్చిన మాట నిలబెట్టడమే కాంగ్రెస్‌ ధ్యేయం
కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ముదిమాణిక్యం సర్పంచ్‌, 200 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు
నవ తెలంగాణ-పుల్కల్‌
తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతున్నదని.. వచ్చే ఎన్నికల్లో ఈ పాలనకు చరమగీతం పాడాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. పుల్కల్‌ మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామ సర్పంచ్‌ పడమటి అరుణ యాదగిరి బీఆర్‌ఎస్‌ నుంచి ఆదివారం రాజనర్సింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఆయనతోపాటు పుల్కల్‌ ఉమ్మడి మండలం నుంచి సుమారు 200 మంది బబీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకు న్నారు. ఈ సందర్భంగా దామోదర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సర్పంచులు అప్పుల పాలవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క సర్పంచ్‌ని గానీ, ఎంపీటీసీలను గానీ ఏ ఒక్కరోజు కూడా ఇబ్బందులు పెట్టలేదన్నారు. గ్రామాలలో చేసిన అభివద్ధి పనులకు వెంటనే బిల్లులు చెల్లించి గ్రామాలను అన్ని విధాలుగా అభివద్ధి చేసిన ఘనత తమ పార్టీదేనన్నారు. కానీ ఇప్పుడున్న నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను, భూములను అన్యాక్రాంతంగా చేయడం దురదష్టకరమ న్నారు. ఇలాంటి నాయకులను తరిమికొట్టే సమయం వచ్చిందని .. ఇప్పుడైనా ప్రజలు బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు దుర్గారెడ్డి, చౌటకూర్‌ మండలాధ్యక్షులు నత్తి దశరథ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు రాంచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సింగూర్‌ జీవన్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
30 మంది యువకులు కాంగ్రెస్‌ లో చేరిక
నవతెలంగాణ-నంగునూరు
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి స్పష్టం చేశారు. ఆదివారం నంగునూరులో ఖానాపూర్‌ గ్రామానికి చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికీ కండువాకప్పి పార్టీ లోకి చేర్చుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో విసుగు చెందిన తెలంగాణా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.కర్ణాటకలో 40 శాతం కమీషండ్ల అవినీతికి పాల్పడ్డ బీజేపీని బొంద పెట్టినట్టు 30 శాతం కమీషండ్ల కేసీఆర్‌ ప్రభుత్వన్ని బొందపెట్టడానికి ఇక్కడి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల కోసం పని చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని తెలుసుకున్న వారందరు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిని వారందరిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. పెరుక నవీన్‌, మోత్కూరి ప్రవీణ్‌,ఘనపురం రమేష్‌,ఘనపురం నరసింహ్మ,నంగునూరు నాగేష్‌, పెరుక హరీష్‌,ఘనపురం ప్రణరు, బి. నవీన్‌, బి దినేష్‌,జి కిరణ్‌, మాధవ్‌, ఎం. రణధీర్‌ లతో కలిసి 30 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు అచ్చిన సత్తయ్య,సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ చెలికాని యాదగిరి, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బాగు శ్రీకాంత్‌ యాదవ్‌, యస్సీ సెల్‌ మండల అధ్యక్షులు రాగుల కష్ణ, నంగునూరు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు అనరాజు నాగరాజు, గోనెపల్లి శివ ప్రసాద్‌ గౌడ్‌,దేవులపల్లి చింటూ, దేవులపల్లి శ్రీకాంత్‌, జాప తిరుపతి,జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love