Sunday, July 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసింగూరు ఖాళీ

సింగూరు ఖాళీ

- Advertisement -

అనధికారిక క్రాప్‌ హాలిడే
ప్రస్తుత నీటిమట్టం 
3.423 టీఎంసీలు
మెదక్, సంగారెడ్డి,నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి ఎద్దడి
హైదరాబాద్‌కు నిలిచిన 
తాగునీటి సరఫరా
నత్తనడకన సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు

నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. మరమ్మతుల పేరిట జలాశయంలో ఉన్న నీటిని ఖాళీ చేశారు. మరో పక్క వర్షాభావం వల్ల ఎగువ నుంచి వరద నీరురావట్లేదు. దీంతో సింగూరు జలాశయం నీటి నిల్వల్లేక కలతప్పింది. ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.423 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జలాశయం సామర్ధ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి కోసం 2.960 టీఎంసీలు ఇవ్వాల్సి ఉండగా అదనంగా మరో 4 టీఎంసీలు సరఫరా చేస్తున్నారు. సాగునీటి కోసం ఘనాపూర్ ఆయకట్టకు 4.060 టీఎంసీలు, మిషన్‌భగీరథ తాగునీటికి 0.700 టీఎంసీలు, సింగూరు కాలువల కింద సాగుకు 2 టీఎంసీలు వినియోగిస్తారు. నీటి ఆవిరి, ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడం, ప్రవాహంలో ఇంకిపోవడం, వచ్చే సంవత్సరానికి నీటిని పొదుపు చేసుకోవడం కోసం 7.847 టీఎంసీలు పోతాయి. సింగూరు నుంచి హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతుంది.

ప్రస్తు తం డ్యాం సేప్టీ అథారిటీ హెచ్చరికలతో మర మ్మతు పనులు సాగుతున్నాయి. వర్షాకా లంలోపు మరమ్మతులు పూర్తి చేస్తామని ప్రకటిం చారు. కానీ పనులు నత్తనడకన సాగుతు న్నాయి. ఓ వైపు సింగూరు అడుగం టిపోవ డం..మరో వైపు ఎల్ నినో ప్రభావం వల్ల నీటితిప్పలు తప్పేట్లులేదు. డ్యాం సేప్టీ అధికా రుల హెచ్చరికలతో అధికారులు సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టనా జూలై నాటికి 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యా యి. డ్యాం సేప్టీ అధికారుల సూచన మేరకు 8 టీఎంసీల వరకు మాత్రమే నిల్వ ఉంచారు. మరమత్తుల నేపథ్యంలో నీటిని దిగువకు వదిలారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురవక పోవడంతో సింగూరులో నీటి ఎద్దడి ఏర్పడింది.

సాగునీటికి కటకట
సింగూరు కాలువల కింద 40వేల ఎకరాలు, మెదక్ జిల్లా ఘనాపూర్ ఆయకట్టు కింది 26వేల ఎకరాలకు సాగునీరివ్వాలి. అదే విధంగా నిజాంసాగర్ కు 8 టీఎంసీల నీటిని వ్యవసాయానికి విడుదల చేయాలి. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ ఉన్నందున సాగునీటి విడుదల ప్రశ్యార్థకంగా మారింది. హైదరాబాద్ జంటనగరాలకు ప్రతిరోజు 130 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.423 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండడంతో రాబోవు రోజుల్లో తాగు నీటికి కష్టాలు తప్పవు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఇటీవల అధికారులకు సూచించారు. వ్యవసాయానికి నీరు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఉన్న నీటితో పాటు తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

క్రాప్ హాలిడే ..
సింగూరు పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరడంతో ఇరిగేషన్ అధికారులు అనధికారికంగా క్రాఫ్ హాలిడే ప్రకటించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో కాలువ ద్వారా సాగయ్యే 40వేల ఎకరాలకు గత రబీ సీజన్‌లో సైతం నీటిని విడుదల చేయలేదు. ఓ వైపు ప్రాజెక్టు రిపేర్లు, మరో వైపు కాలువల ఆధునీకికరణ పనుల పేరుతో సాగుకు నీటిని వదలలేదు. దీంతో రెండు సీజన్లుగా పంటల సాగు ఆగిపో యింది. వర్షాలుపడక భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల్లో నీళ్లులేక వ్యవసాయం కుంటుపడింది. కనీసం సింగూరు్ ప్రాజెక్టు ఇస్తారనుకుంటే డెడ్‌‌స్టోరేజీ పేరిట నీటిని విడుదల చేయకపోవడంతో ఈ ఖరీఫ్‌‌లోనూ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఫిబ్రవరిలో పనులు అప్పజెప్పినప్పటికీ కాంట్రాక్టర్‌ ‌నిర్లక్షం వల్ల ప్రాజెక్టు రివిట్ మెంట్ పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటివరకు 30శాతం పనులు పూర్తయ్యాయి. . పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

​తాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు భీమ్ ఇరిగేషన్ ఈఈ
సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల వల్ల నీటిని ఖాళీ చేసి 8 టీఎంసీల స్టోరేజీ ఉంచాం. తాగునీటి అవసరాల కోసం నీటిని కిందకు వదలడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 3.423 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పై నుంచి నీరు వస్తే ప్రాజెక్టులో 8 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని కిందకు వదులుతాం. ప్రస్తుతం సాగుకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. క్రాఫ్ హాలిడే ప్రకటించాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -