ప్రైమరీల్లో డెమొక్రటిక్ సోషలిస్టుల విజయాలు
వాషింగ్టన్ : మధ్యంతర ఎన్నికలకు అమెరికా సిద్ధపడుతున్న సమయంలో తాజా పోలింగ్ డేటా తీవ్ర సైద్ధాంతిక పోటీని సూచించడంతో పాటు విస్తృత నయా ఉదారవాద వ్యవస్థను సవాలు చేస్తోంది. ముఖ్యంగా వామపక్ష యువతలో, కార్మిక వర్గంలో ప్రజాస్వామ్య సోషలిజానికి పెరుగుతున్న ప్రజాదరణకు అద్దం పడుతోంది. వాస్తవానికి ఈ ధోరణి 2008 ఆర్థిక సంక్షోభసమయంలోనే వ్యక్యమైంది. పెట్టుబడిదారీ విధానంపై ప్రజలలో విశ్వాసం క్రమేపీ సన్నగిల్లిపోతోంది. అమెరికాలో కమ్యూనిజం బలం పుంజుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్లు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. డెమొక్రాట్లదీ అదే భావన. తమ కాళ్ల కింద నేల కదులుతుందేమోనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కన్పిస్తోంది.
ప్రైమరీల్లో గణనీయ విజయాలు
సోషలిస్టు భావాలు ఉన్న వారు ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మంచి విజయాలు సొంతం చేసుకున్నారు. డెమొక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (డీఎస్‌ఏ) అనుబంధ అభ్యర్థులు, ప్రజాస్వామ్య సోషలిస్టు వేదికలు ఎన్నికల్లో విజయాలు సాధించడమో లేదా స్వల్ప తేడాతో పరాజయం పొందడమో జరిగింది. కుటుంబ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ, అసమానతలు వంటి అంశాలను వారు ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు. అమెరికాలో ‘నో కింగ్స్’ పేరిట జరిగిన భారీ ప్రదర్శనలు పాలకులపై వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ప్రైమరీ ఎన్నికల్లో 170 మంది సోషలిస్టులు పోటీ చేయగా వారిలో 60 మంది విజయం సాధించారు. 54 మంది ఓటమి పాలయ్యారు. 50 స్థానాలలో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. న్యూయార్క్, మిన్నెసోటా, వెర్మాంట్, మిచిగాన్, వాషింగ్టన్‌లో వీరు అనేక విజయాలు నమోదు చేసుకున్నారు. కొలరాడో, మైనే, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియా మొదలైన ప్రాంతాల్లో కూడా ప్రగతిశీల సోషలిస్టులదే విజయం. సోషలిజం విషయంలో డెమొక్రాట్ల వైఖరిలో ఇప్పుడు సానుకూల మార్పు కన్పిస్తోంది. ముఖ్యంగా యువతరం పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తోంది.
ఓటర్ల మొగ్గు
గత నెలలో అమెరికాలో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే… వాషింగ్టన్ పోస్ట్/ఇప్సోస్ నిర్వహించిన పోల్ ప్రకారం ఓటర్లలో సుమారు 40 శాతం మంది సోషలిస్ట్ అధ్యక్ష అభ్యర్థికి సానుకూలత వ్యక్తం చేశారు. 30 ఏండ్ల లోపు వారిలో 46 శాతం మంది సోషలిస్టు అభ్యర్థికే మద్దతు ప్రకటించారు. అలాగే డెమొక్రాట్లలో 64 శాతం మంది సానుకూలంగా స్పందించారు. సీఎన్‌ఎన్/ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక ప్రకారం దాదాపు మూడింట ఒక వంతు డెమొక్రాట్లు, వారి వైపు మొగ్గు చూపే స్వతంత్రులు ఇప్పుడు తమను తాము డెమొక్రటిక్ సోషలిస్టులుగా చెబుతున్నారు. ఈ వర్గంలో ఎక్కువ మంది యువకులు (45 ఏండ్ల వయసు లోపు వారు), శ్రామికులు (వీరిలో ఎక్కువ మంది వంద – కే డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్న వారు, కళాశాల విద్య కంటే తక్కువ చదువుకున్న వారు) ఉన్నారు.
అమెరికాలో సోషలిజానికి ఆదరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



