క్షమించు చెల్లీ!

Sampadakiyamఇది మనుస్మృతి ఆధారంగా సనాతన ధర్మాలోచనతో జరుగుతున్న పరిపాలన. ఇక్కడ సీతల అగ్ని ప్రవేశాలు, ద్రౌపతి వస్త్రాపహరణం, కుంతి విలాపాలు, అహల్య శాపగాథలు అన్నీ కొనసాగుతాయి. సహన శీలవతిగా నువ్వు భరించాలి! క్రీడలలోకి ప్రవేశించే అమ్మాయిలారా! అమ్మాయిల తల్లిదండ్రులారా ఇది మీకొక హెచ్చరిక. బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య పదవి నుంచి వైదొలగినా, అతని నహచరుడు సంజరుసింగ్‌ ఇప్పుడు గెలిచాడు. గెలవగానే బ్రిజ్‌ భూషణ్‌ ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు పొందాడు. నీ సంప్రదాయాన్ని కొనసాగిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇక ఎంతో జాగ్రత్తగా వుండాలి మరి!
క్షమించడమూ రాదా నీకు! క్షమించు. మా నేరాలను, ఘోరా లను, అఘాయిత్యాలను, అత్యాచారాలనూ అన్నీ క్షమించే గుణాన్ని, బలాన్ని కలిగుండాలి నువ్వు. ఎందుకంటే అవి రోజురోజుకూ పెరుగు తూనే వుంటాయి. అరికడతామని, బిడ్డను కాపాడతామని ఎన్ని నినా దాలతో కూడిన హామీలనిచ్చినా… అవన్నీ మంచిగ వినపడతాయని చెప్పినవే కానీ చేయటం కష్టమైన పని. అధినాయకులకు, అధికా రానికి, చివరకు న్యాయవ్యవస్థకూ సాధ్యం కానిపని. అందుకే క్షమిం చాలి. క్షమించడమంటే, భరించాలి. భరించడమంటే ఏమిటో కూడా నీకు తెలుసు. నిష్క్రమించటమే కదా! నువ్విప్పుడు ఆ పనే చేశావు. ఇంకెందరు ఆ విధంగా చేయాలో, మీపై పెరుగుతున్న ఆ నేర జాబితా సంఖ్యలు తెలియజేస్తాయిలే. నువ్వు ఏడుస్తూ ఏడుస్తూ… ఈ దేశానికి గర్వకారణమయిన పతకం ‘సాక్షి’గా నువు రక్షణగా వేసు కున్న బూట్లు, గ్లౌస్‌లు టేబుల్‌పై పెట్టి వెనుదిరగటం, ఇక ముందు రెజ్లింగ్‌ను కొనసాగించనని, వదిలేయటం మాక్కొంత సిగ్గుగా వున్నా, బాధనిపిస్తున్నా… నువ్వు క్షమించాలి!
ఒక ఏడాది క్రితం మిమ్మల్ని కాపాడుకుంటూ ప్రోత్సహిం చాల్సిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడే వేధింపులకు పాల్పడు తుంటే రోడ్డెక్కారు. చర్యలు తీసుకుంటామని హామీ మేరకే ఆందోళన విరమించారు. కానీ ఇప్పుడేమయింది. అతని చెప్పు చేతల కదలాడే వాన్ని తిరిగి అధ్యక్షునిగా గెలిపించారు. అత నేమో పార్లమెంటులో దర్జాగా కూర్చున్నాడు. ఏం చేస్తాం! ఓ నాప్రియమైన భారత పుత్రికా! సాక్షి మాలిక్‌, నీకు మద్దతుగా ఒకరో ఇద్దరో… రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తన పద్మశ్రీ అవా ర్డును తిరిగి ఇచ్చేయటానికి ప్రధాని మోడీ ఇంటి ముందుకు వెళ్లవచ్చు. బాక్సర్‌ విజేందర్‌ లాంటివాళ్లు నీ పోరాటం న్యాయ బద్దమైనదని జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండు చేయవచ్చు. అయినా నువ్విక చేసేదేమీ లేదు చెల్లీ! క్షమించాలి. నీకోసం గొంతులెత్తే వాళ్లు అందరూ ఇపుడు సభా బహిష్కారంలో వాళ్లూ రోడ్డు నపడ్డారు. ప్రశ్నించే గొంతులేవీ సహించబడటం లేదు.
ఇది మనుస్మృతి ఆధారంగా సనాతన ధర్మాలోచనతో జరు గుతున్న పరిపాలన. ఇక్కడ సీతల అగ్ని ప్రవేశాలు, ద్రౌపతి వస్త్రాపహరణం, కుంతి విలాపాలు, అహల్య శాపగాథలు అన్నీ కొనసాగుతాయి. సహన శీలవతిగా నువ్వు భరించాలి! క్రీడల లోకి ప్రవేశించే అమ్మాయిలారా! అమ్మాయిల తల్లిదండ్రులారా ఇది మీకొక హెచ్చరిక. బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య పదవి నుంచి వైదొలగినా, అతని నహచరుడు సంజరుసింగ్‌ ఇప్పుడు గెలిచాడు. గెలవగానే బ్రిజ్‌ భూషణ్‌ ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు పొందాడు. నీ సంప్రదాయాన్ని కొనసాగిస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇక ఎంతో జాగ్రత్తగా వుండాలి మరి!
ఇది ఒక్క క్రీడాకారిణుల మీద జరుగుతున్న దాడి మాత్రమే కాదు తల్లీ. దేశంలో మహిళల మీద జరిగే నేరాలు 2016 నుండి 2021 వరకు 26.35 శాతం పెరిగాయి. ఇవన్నీ పోలీసులకు ఫిర్యాదు చేసినవి మాత్రమే. ఫిర్యాదు చెయ్యని నేరాలు ఇంకెన్నో వుంటాయి. తెలిసి జరిగిన నేరాల పైనే మనం చర్యలకు వెనకాడు తున్నాము. ఉన్నావ్‌ సంఘటనలో మనం ఏం న్యాయం చేశాం. కతు వా ఘటనలో న్యాయం జరిగిందా? అంతెందుకు సామూహిక అత్యా చారానికి గురై 14 మంది కుటుంబ సభ్యులు హత్యకు గురయిన బిల్కిస్‌ బానో కేసులో దోషులకు క్షమాభిక్ష పెట్టిన ఉదార స్వభావపు నేతలున్న సమాజాన నువు ఎన్నింటికో సహించాలి. ఈ కేసు చాలా పాతది. తాజాగా చెబుతా విను. మొన్నటికి మొన్న న్యాయం అం దించే న్యాయమూర్తికే మహిళయినందువల్ల వేధింపులు తప్పలేదు. న్యాయ దేవతే న్యాయంకోసం మొరపెట్టుకుంది. ఇక సామాన్యు లదేముంది. ధర్మాలను వల్లిస్తాం. అధర్మంగా వ్యవహ రిస్తాం. నీతిని పలుకుతాం. నినాదాలిస్తాం, ఆచరణ కష్టం కనుక వదిలేస్తాం. ఆడది ఆది పరాశక్తి. పూజగదిలోనే. అన్నింటినీ క్షమిస్తావా! కానీ, పోరాటం విరమించకు!

Spread the love