Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గమ్మ పండుగలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

దుర్గమ్మ పండుగలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

- Advertisement -

 నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని రాయిగిరి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాంశ్  యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి కరుణాకటాక్షాలు జిల్లా ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్ఐ అనిల్ కుమార్,స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీసు అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -