శ్వాసకోశ వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం

నవ తెలంగాణ -నాంపల్లి: మండలంలో ఎవరికైన శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు ఉండి టిబి అని అనుమానం వాళ్ళు, ఇదివరకే  తెమడ పరీక్ష చేయిస్తే నెగెటివ్ వచ్చినా  ఇన్ఫెక్షన్ అంటే దగ్గు, తెమడ, ఆయాసం, బరువు తగ్గడం, సాయంత్రం పూట జ్వరం రావడం  లక్షణాలు  రెండు వారాలకు మించి  ఉన్నవారికి   నాంపల్లి  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ఉచితంగా పరీక్షలు చేయడానికి  శుక్రవారం  జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక వైద్యులు, వాహనం రావడం జరుగుతుందని, అవసరం అయిన వారికి అక్కడే ఎక్స్ రే కూడా తీయడం జరుగుతుందని నాంపల్లి పీ హెచ్ సి డాక్టర్ సయ్యద్ ఇక్బాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.   పైన చెప్పిన లక్షణాలు ఉన్న అందరూ పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని అవకాశాన్ని సద్విియోగం చేసుకోవాలని కోరారు.
Spread the love