జై షా వల్లే శ్రీలంక క్రికెట్ నాశనం అయింది: రణతుంగ

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : వన్డే వరల్డ్‌ కప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆడిన 9 మ్యాచ్‌లలో రెండింటిలో మాత్రమే గెలిచి ఏడు మ్యాచ్‌లు ఓడిన లంక 9వ స్థానంలో నిలిచింది. వరల్డ్‌కప్‌లో ఆ జట్టు ప్రదర్శనపై ఆగ్రహంగా ఉన్న లంక క్రీడాశాఖ మంత్రి రోషన్‌ రణసింఘె.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సభ్యులందరిపై వేటు వేయడం. తాజాగా ఆ దేశ మాజీ సారథి, దిగ్గజం అర్జున రణతుంగ.. బీసీసీఐ సెక్రటరీ జై షాపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. లంక క్రికెట్‌ బోర్డును నాశనం చేస్తున్నది జై షా అంటూ ఆరోపించాడు. డైలీ మిర్రర్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణతుంగ స్పందిస్తూ.. ‘శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) జై షా కనుసన్నల్లో నడుస్తోంది. అతడి ఒత్తిడి వల్లే ఎస్‌ఎల్‌సీ నాశనమైంది. ఎస్‌ఎల్‌సీలోని కొంతమంది వ్యక్తులు జై షా మన్ననలు పొందేందుకు గాను లంక క్రికెట్‌ బోర్డును నాశనం చేస్తున్నారు. భారత్‌లో కేంద్ర హోంమంత్రి తన తండ్రి కావడంతో జై షా అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నాడు’ అని అన్నాడు.

Spread the love