ఐపీఎల్ ఫైనల్‌‌ తాజా అప్‌డేట్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆహ్మదాబాద్ లో ఆదివారం రాత్రి వర్షం భారీగా కురువడంతో జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వాయిద పడింది.  నేటికి  గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఈ ఫైనల్ పోరు కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురైంది. రాత్రి 11 గంటలకు కూడా నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తుండడం, అప్పటికే మైదానం చిత్తడిగా మారిపోవడంతో వాయిదా వేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. రిజర్వ్ డే అయిన సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమవ్వాల్సి ఉంది. అయితే మరి ఈ రోజు వాతావరణం ఎలా ఉంది?.. వాతావరణ అంచనాలు ఏవిధంగా ఉన్నాయంటే..ప్రస్తుతానికైతే అహ్మదాబాద్‌లో వాతావరణం పొడిగానే ఉంది. ఎలాంటి వర్షం లేదు. ఆకాశం కూడా సాధారణంగానే ఉంది. అయితే వాతావరణ శాఖ తాజా రిపోర్ట్ ప్రకారం.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య వర్షం పడొచ్చని అంచనా వేసింది. అయితే.. ఆదివారం రాత్రి మాదిరిగానే భారీగా వర్షం పడి మ్యాచ్ రద్ధయితే చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకు గురవ్వడం ఖాయం. ఎందుకంటే ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్‌కే ఐపీఎల్ 2023 ట్రోఫీ దక్కనుంది. ఐపీఎల్ నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి.

Spread the love