30న కేజ్రీవాల్ ను కలవనున్న పంజాబ్ సీఎం మాన్

నవతెలంగాణ-హైదరాబాద్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఏప్రిల్ 30న తీహార్ జైలులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ తే భేటీ కానున్నట్లు తెలిపారు ఆప్ నేతలు. కేజ్రీవాల్ తో మాన్ భేటీ కావడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో జైలులో కేజ్రీవాల్‌ తో భేటీ అయ్యారు భగవంత్ మాన్. కేజ్రీతో మీటింగ్‌ అనంతరం భగవంత్‌ మాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను కేజ్రీని అలా చూసి ఉద్వేగానికి లోనయినట్లు తెలిపారు. ఆయన్ని అక్కడ ఓ కరుడుగట్టిన నేరస్థుడిలా ట్రీట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్స్‌కు దక్కే సౌకర్యాలు కూడా కేజ్రీకి ఇవ్వడం లేదన్నారు. ఆయన చేసిన నేరం ఏంటి..? అని ప్రశ్నించారు. దేశంలోని అతిపెద్ద టెర్రరిస్టుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా కేజ్రీవాల్ తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకపోతే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకిసంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు అయ్యారు.

Spread the love