Monday, July 6, 2026
E-PAPER
Homeఆటలుశ్రీలంక భారీ స్కోరు

శ్రీలంక భారీ స్కోరు

- Advertisement -

నార్త్‌సౌండ్‌ : వెస్టిండీస్‌తో రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో నిశాన్‌ మధుష్క (1), దినేశ్‌ చండిమాల్‌ (1) విఫలమైనా..ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 549 పరుగులు చేసింది. ఓపెనర్‌ లహిరు ఉదర (188, 248 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్‌లు), కమిందు మెండిస్‌ (84, 120 బంతుల్లో 11 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌ (69, 115 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సోనల దినుశ (92, 166 బంతుల్లో 12 ఫోర్లు) రాణించారు. 139.3 ఓవర్లలో 9 వికెట్లకు 549 పరుగులు చేసిన శ్రీలంక ఓ వికెట్‌ ఉండగానే ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ఇచ్చింది. ఆతిథ్య వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 122/1తో ఎదురీదుతోంది. ఓపెనర్‌ జాన్‌ కాంప్‌బెల్‌ (72 నాటౌట్‌, 153 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. బ్రాండన్‌ కింగ్‌ (17) అవుటవగా.. కావెవ్‌ హోడ్జె (23 నాటౌట్)తో కలిసి కాంప్‌బెల్‌ అజేయంగా ఆడుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 427 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -