నవతెలంగాణ-మంగపేట : మండలంలో శాంతి భద్రతలే లక్షంగా పోలీసింగ్ ఉంటుందని ఎస్సై రవికుమార్ అన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్ లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో పోలీసింగ్ ఉంటుందన్నారు. మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, మహిళలు, యువత పోలీసుల విధులకు సహాకరించాలన్నారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి మండలంలో శాంతి భద్రతలే లక్ష్యంగా పని చేయాల్సి ఉన్నందున ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలనైనా ఉపేక్షించేది ఉడదన్నారు. మండలంలో జరిగే అసాంఘీక కార్యక్రమాలను అణిచివేసేందుకు యువత పోలీసులకు సహాకరించాలన్నారు. ఎలాంటి సమాచారమైనా 24/7 అందజేయవచ్చని ఎస్సై రవికుమార్ తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మండల అద్యక్షుడు వేమా సురేష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ వీరయ్య, అడ్వైజర్లు ఎర్రం స్వామి, ధర్మపురి శ్రీనివాస్, వడ్లకొండ శ్రీనివాస్, మఠం రమేష్, నిమ్మగడ్డ శ్రీనివాస్, మేడ ఆదినారాయణ, కుటుకూరి సాంబశివరావు, అక్కపెల్లి రాజేష్, పాత్రికేయులు అక్కినపెల్లి వెంకటేశ్వర్లు, పవన్ కల్యాన్, జయరాజు, పల్లాపు రమేష్, శివమహేష్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.