ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

– తుక్కాపురంలో డి సి ఓ శ్రీనివాస్, బొమ్మాయిపల్లిలో మార్కెట్ కార్యదర్శి అంజితరావు
నవ తెలంగాణ- భువనగిరి రూరల్:
భువనగిరి మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో పిఎసిఎస్ భువనగిరి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. మార్కెట్లో ఎలా ఇవ్వని ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ అధికారి కె వెంకట్ రెడ్డి, ఏ ఈ ఓ మౌనియ, బ్యాంకు సీఈవో ఎం రామలింగా చారి, సిబ్బంది మల్లేష్, రైతులు అర్జున్ రెడ్డి, పాల్గొన్నారు. బొమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. భువనగిరి పిఎసిఎస్ పరిధిలోని బొమ్మాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ కార్యదర్శి అంజిత్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యంలో తేమ, తాలూ లేకుండా చూడాలని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్వైజర్ రాజీవ్, ఏఈఓ అనిల్, బ్యాంకు సి ఈ ఓ ఎమ్ రామలింగా చారి, సిబ్బంది మల్లేష్, బొమ్మాయిపల్లి రైతులు పాల్గొన్నారు.
Spread the love