రాష్ట్ర అభివృద్ధికి కృషి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల 

నవతెలంగాణ-  మల్హర్ రావు
రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. అసెంబ్లీలో ఐటి, పరిశ్రమలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా మొదటి అసెంబ్లీ సమావేశాలు గురువారం జరిగాయి.ఈ సమావేశంలో దుద్దిళ్ల మాట్లాడారు అంచెలంచెలుగా ఎదిగి స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.శాసనసభలో మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేస్తారని స్పీకర్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తన తండ్రి శ్రీపాద రావు కూడా ఇదే శాసనసభలో పని చేసి ఆ చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని ఈ సందర్భంగా దుద్దిళ్ల గుర్తుచేశారు.
Spread the love