Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రీ-ప్రైమరీతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం: ఎంఈఓ

ప్రీ-ప్రైమరీతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతాయని మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 2769 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నది అని అన్నారు. అందులో భాగంగా మండలంలోని పార్వతమ్మ గూడెం, రావిరాల ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నుండి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు బోధన చేయటానికి ఇన్స్ట్రక్టర్లను, చిన్నారుల సంరక్షణను చూసుకునేందుకు ఆయాలను నియమించనున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ఈ తరగతులను ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడంతో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని తద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం అవుతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -