నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఎస్సై రమేష్ 

నవతెలంగాణ – వీర్నపల్లి 

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపులను శనివారం తనిఖి చేసి చేసి రికార్డ్ లను ఎస్సై జిల్లెల రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేశామన్నారు. ఫర్టిలైజర్స్ షాపుల యజమానులు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం విత్తనాలు అమ్మాలి అమ్మిన రశిదులను రైతులకు ఇవ్వాలన్నారు . రశిదులో తప్పనిసరిగా కంపెనీ పేరు,విత్తన రకం , లాట్ నంబర్ ఉండేలా చూసుకోవాలని దుకాణ యజమానులకు సూచించారు. బిల్లులు లేని విత్తనాలను, లూజు విత్తనాలను, నకిలీ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విరి వెంట ఎ ఈ ఓ శ్రీదర్ రెడ్డి, పోలిస్ సిబ్బంది ఉన్నారు.
Spread the love