తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు..

– ఇంచార్జీ ఎస్సై మనోజ్ కుమార్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా చిన్న పిల్లల కిడ్నాప్‌ల పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇందల్ వాయి ఇంచార్జీ ఎస్సై మనోజ్ కుమార్ అన్నారు.శనివారం ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్బంగా అయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో చిన్న పిల్లల కిడ్నాప్ అని బాగా వైరల్ కావడం వలన ప్రజలు బయబ్రాంతులకు గురిఅవ్వడం జరుగుతున్నది. పోలిసులు చిన్న పిల్లల కిడ్నాప్ లపై నిజామాబాదు పోలీస్ కమీషనర్ కమ్లెశ్వర్  ఆదేశాలమేరకు నిరంతరం పెట్రోలింగ్, గస్తి ముమ్మరం చేసి ఏలాంటి సంగటనలు జరగకుండా చర్యలుతీస్కోవడం జరుగుతుందని, కానీ కొంతమంది ఆకతాయిలు గ్రామాలలో దీనిని అదునుగా చేసుకొని గ్రామాలోకి కొత్తవారు రాగానే ఎలాంటి విషయాలు తెసులుకోకుండా వారిపై దాడికి దిగడం, బందించడం  చేస్తున్నారని ఇలా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ టౌన్-1, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ పీఎస్ పరిధిలో ఇటీవల మూడు కిడ్నాప్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో కిడ్నాప్‌కు గురైన చిన్నారులందరినీ గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. అయితే అనుమానితులను విచారిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారిని కిడ్నాపర్లుగా చిత్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో సామాన్యులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లను ఇతరులకు పంపే ముందు ఒక్కసారి నిజా నిజాలు తెలుసుకోవాలని, నిరాధారమైన పోస్టులను సోషల్ మీడియా లో ఫార్వర్డ్ చేస్తూ ప్రజలకు అభద్రతాభావం కలిగించే వ్యక్తులను పోలీసులు గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గ్రామాలలో ఎవరైనా చుట్టరికంగా లేదా ఏదైనా పనుల నిమిత్తం వచ్చిన వారిని అనవసరంగా బంధించకుండా, దాడి చేయకుండా అనుమానం ఉన్నచో డయల్ 100 కు గాని, పోలిస్ స్టేషన్ లో సమాచారం తెలపాలని పోలీసులు తక్షణమే వచ్చి విచారణ చేస్తారని దానికోసం ప్రజలు సహకరించాలని కోరారు.
Spread the love