నకిలీ విత్తనలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు: ఏఓ రాంబాబు

నవతెలంగాణ – డిచ్ పల్లి
విత్తనాల డీలర్లు వ్యవసాయ శాఖ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు హెచ్చరించారు. శుక్రవారం  డిచ్ పల్లి మండల కేంద్రంలో నడిపల్లి  విత్తనాల, ఎరువుల దుకాణాలను అకస్మీకంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం 2024 కు గానూ విత్తనాల డీలర్లు నియమా నిబంధనలు పాటించల్సి ఉంటుందని వివరించారు.విత్తన డీలర్లు వీధిగా రైతులు విత్తనాలు కోనుగోలు చేసిన వేంటనే దానికి సంబంధించిన బిల్లులను ఇవ్వాలని ఆదేశించారు. విత్తనల లైసెన్స్ వివరాలను ధరల పట్టిక లు ఏర్పాటు చేయాలని, విత్తనాలు కోనుగోలు చేసిన రైతుల వివరాలను ఏరోజు క రోజు విత్తన రిజిస్ట్రార్ లో పోందు పర్చాలని సూచించారు.అనంతరం పలు విత్తన, ఎరువుల దుకాణంలోనూ ఆకస్మికంగా  తనిఖీలు చేశారు.నకిలీ విత్తనములు అమ్మితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అమ్మే విధంగా చూసుకోవాలని వారికి సూచించారు.

Spread the love