యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సమ్మె కుమద్దతు.. 

నవతెలంగాణ- డిచ్ పల్లి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ సాధన సమ్మె లో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు బచ్చనబోయిన శివ, ఇతర నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుండే అధ్యాపకులే ఈరోజు రోడ్డున నిల్చోని ధర్నా చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతులే ఉండవు అన్న కేసీఆర్ కు ఈరోజు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కనబడట్లేదా అని ప్రశ్నించారు.యూనివర్సిటీలో అభివృద్ధి చెందాలంటే విద్యార్థులకు సరైన, సౌకర్యాలు కల్పించాలి కానీ యూనివర్సిటీలోని రిక్రూట్మెంట్లు ఆపేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిటం సరికాదని అన్నారు.యూనివర్సిటీలోని కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్  చేయాలని  డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ  వైఖరి ఇలాగే కొనసాగితే యూనివర్సిటీలను కాపాడుకునేందుకు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేంత వరకు పోరాడుతామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, నాయకులు ప్రసాద్, సింహాద్రి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love