వర్షాభావంతో సతమతం సాగునీటికి పోరాటం

– నియోజకవర్గం ప్రజల ముందున్న కర్తవ్యం
– వరుణుడిపై ఆశలు వదులకున్న అన్నదాత
– ‘కృష్ణమ్మ’ను తేవాల్సిందే.. చెరువులు నింపాల్సిందే..
– సీపీఐ(ఎం) ఆదరించండి.. సాగునీటిని సాధిద్దాం
– ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్య
‘ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వ్యవసాయరంగం నీరులేక దివాళ తీసింది. వరుణుడి పైనే సాగు ఆధారపడింది. వరుణుడి కోసమే ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. అనునిత్యం ప్రకృతి వైపరీత్యాలు రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఫలితంగా పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పంట భూములు బీడువారుతున్నాయి. గతేడాది విస్తారంగా వర్షాలు కురిసినా.. చెరువులు, కుంటల్లో నీరు చేరినా.. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటలు కళతప్పాయి. వీటినే నమ్ముకున్న అన్నదాత బతుకు దుర్బరమైంది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపాలని చిన్ననీటి పారుదలశాఖ గత రెండేళ్ల క్రితం చేసిన ప్రతిపాదనలు ఏమైనట్లో అధికారులకే తెలియాలి. ఈ తరుణంలో సాగు నీటి కోసం పోరాటం నిర్వహించాల్సిన కర్తవ్యం నియోజకవర్గం ప్రజలపై ఉంది.’ అని ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య అన్నారు. నియోజకవర్గ పరిస్థితులపై ఇతర విషయాలు ఆయన మాట్లాలోనే తెలుసుకుందాం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నియెజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లో మొత్తం 87 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 550 చెరువులు, కుంటలు ఉన్నాయి. మంచాల మండలంలో 239 పంచాయతీరాజ్‌ చెరువులు, 5 ఇరిగేషన్‌ చెరువులు, ఇబ్రహీం పట్నంలో 88 పీఆర్‌, 8 ఇరిగేషన్‌, యాచా రంలో 109 పీఆర్‌, 6 ఇరిగేషన్‌, అబ్దులా పూర్‌లో 114పీఆర్‌ చెరువులున్నాయి. వీటి కింద సుమారు 15వేల ఎకరాల్లో వరి పంటలు సాగ య్యేది. ఇవ్వన్నీ వంద ఎకరాలకు పైబడిన చెరువులు. ఒక ఇబ్రహీంపట్నం పెద్ద చెరు వు కిందనే 1250 ఎకరాల ఆయక ట్టుంది. బోడ కొండలోని కండ రాయుని చెరువు కింద 280 ఎకరాలు, పోల్కం పల్లిలోని నాగు లమ్మకుంట కింద 220 ఎక రాలు, ఎలిమి నేడులోని బండ కత్వ కింద 240 ఎకరాల ఆయక ట్టుంది. వర్షాలు విస్తారంగా కురిస్తే రెండు పంటలకు అను కూలం. ఈ చెరువుల కింద సాగు వల్ల పరి సర గ్రామాల ప్రజల కు నెల రోజుల
పాటు వరి కోతలతో ఉపాధి లభిస్తుంది. ఈ సారి కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లో కొద్దికొద్దిగా నీరు చేరింది. ఆ నీటితోనే నేడు కొద్దికొద్ది పంటలు సాగు చేశారు. అయినా రైతుకు పంట చేతికొచ్చే వరకు నీరు లేక ఎండుముఖం పట్టాయి. నియోజకవర్యగంలో ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు లేవు. వృధాగా పోతు న్న నీటిని తెచ్చి చెరువులు, కుంటలను నింపాల్సిం దేనని రైతులు వేడుకుంటున్నారు.
నాడు తాగునీరు.. నేడు సాగునీరు
పోరాటాల ద్వారానే వృథాగా పోతున్న కృష్ణా నీ టిని ఇబ్రహీంపట్నం రప్పించుకోవచ్చని గత అను భవాలు చెబుతున్నాయి. ఏండ్ల తరబడి ప్లోరైడ్‌ నీటితో బాధ పడుతున్నామని, దశల వారి ఆందో ళనల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పట్టించు కోలేదు. చివరకు వేలాది మందితో సీపీఐ(ఎం) 2005లో చలో అసెంబ్లీని నిర్వహించి, ఇబ్రహీంప ట్నం నియోజకవర్గానికి కృష్ణా తాగునీటిని అందించిం ది. ఇదే తరుణంలో సాగునీటిని పోరా టాల రూపంలో సాధించుకోవాల్సిన అవసరముంది. అందుకు ఏ రాజ కీయ పార్టీ ప్రత్యక్ష ఆందో ళనకు రూపకల్పన చేయ లేదు. నియోజకవర్గంలోని 550 చెరువులు, కుంట లను నింపడం ద్వారా చెరు వుల కిందున్న వేలాది ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి రావడమే కాకుండా బోరు బావుల్లో కూడా భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ రంగా నికి అనుకూలంగా మారుతుంది. అందుకు సీపీ ఐ(ఎం) నాయకత్వం నియోజకవర్గంలో రావాల్సిన అవసరముంది. ప్రభుత్వంతో పోట్లాడి నిధులు తీసుకువచ్చే ఘనత సీపీఐ(ఎం) తోనే సాధ్యమవుతుంది.

సీపీఐ(ఎం)ను ఆదరించండి
నియోజకవర్గంలో వర్షాధార పంటలకే పరిమితమైంది. సాగునీటిని సాధించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేవెళ్ల-ప్రాణహిత అం టే, బీఆర్‌ఎస్‌ పాలమూరు-రంగారెడ్డి అంటుంది. మరో వైపు డిండీ ద్వారా నీళ్లను తెస్తామంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెస్తామంటుంది. ఏ ప్రాజెక్టు ద్వారా నీటిని తెస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. సాగునీటి ప్రాజెక్టులు రాకుంటే వ్యవసాయరంగం ప్రశ్నార్థకమవుతుంది. సీపీఐ (ఎం) పోరాటం ఫలితంగానే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కృష్ణా తాగునీటిని సాధించు కున్నాం. సాగునీటి సాదనకు సీపీఐ(ఎం)ను ఆద రించి గెలిపించాలి. ప్రజల మద్దతుతోనే ఉద్యమా ల ద్వారానే సాగునీటి సాధ్యమౌతుంది.
– పగడాల యాదయ్య , ఎమ్మెల్యే అభ్యర్థి

Spread the love