- Advertisement -
నవతెలంగాణ-నారాయణపేట
నారాయణపేట జిల్లా, నారాయణపేట మండల పరిధిలోని ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుతో మూడో తరగతి విద్యార్థి రంజిత్(8) మృతిచెందాడు. తరగతి గదిలోనే బాలున్ని పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు నారాయణపేట జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే పరిస్థితి విషమించి బాలుడు మృతిచెందాడు. కుమారుని మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణ, చెట్ల పొదలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



