విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలి

Students should behave well– సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– ధర్మారం ఏఎస్ఐ జలీల్
నవతెలంగాణ – ధర్మారం
విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ధర్మారం ఏఎస్ఐ జలీల్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై సెల్ఫోన్లో వాడకంపై ధర్మారం పోలీసుల ఆధ్వర్యంలో ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ జలీల్ మాట్లాడుతూ.. బాలికల భద్రతపై వివరించారు. విద్యార్థులు సైబర్ నేరాల నుండి దూరంగా ఉండాలని, సోషల్ మీడియా వలన జరుగుతున్న అనర్థాల గురించి, అప్రమత్తంగా ఉండాలని తద్వారా లాభ నష్టాలు, బీరీజు  వేసుకొని మంచిని మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు. చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు యువతలో పెరుగుతున్న దురలవాట్ల గురించి, వివరిస్తూ చెడు మార్గాలను చదివించాలని విద్యార్థులందరికీ వివరించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఏ విధంగా ఉండాలి, సహచరుల ప్రవర్తనలో బాలికలకు లైంగికంగా ఇబ్బంది కలిగే విధంగా ఉంటే వెంటనే 1098 నంబర్ కి కాల్ చేసి నిర్భయంగా ఉండవచ్చునని తెలిపారు. అలాగే పాఠశాల విద్యార్థులు అందరూ ప్రస్తుత మొబైల్ వాడకం అనవసర ఆకర్షిత ప్రభావాలను వ్యతిరేకిస్తూ.. విద్యార్థుల అభివృద్ధి కోసం విద్యకు సంబందించి మాత్రమే ఉపయోగించు కోవాలని అన్నారు. మొబైల్ గేమ్స్ ఇతరత్రా విషయాలకు ఉపయోగించరాదని తెలిపారు. ఒక వేళ మీ మొబైల్ ద్వారా బ్యాంక్ నుండి అమౌంట్ మీకు తెలియకుండా డెబిట్ ఐతే వెంటనే సైబర్ క్రైమ్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకి 100,1930 టోల్ ఫ్రీ నంబర్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి, అవగాహన కల్పించారు. ఈ  కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేని రాజ్ కుమార్, ఏ ఎస్ ఐ జలీల్, పోలీసులు రజినీకాంత్, మధుసూధన్ రెడ్డి,తిరుపతి, పాఠశాల ఐయామ్ ఉపాధ్యాయులు బైక్ అని కొమరయ్య సంజీవరావు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు,ఎన్న్ బోధన సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love