ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు

– ప్రాణాలతో చెలగాటం ఆడడం సిగ్గుచేటు
– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌
– కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, బీఎస్పీ నాయకులను పోలీస్టేషన్‌కు తరలింపు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
ప్రభుత్వ వైఫల్యంతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతు న్నారని, ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్న వారికి నిరాశా మిగిల్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చెందుతుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శనివారం షాద్‌నగర్‌ పట్టణంలో ప్రతిపక్ష విపక్షాల ఆధ్వర్యంలో సడక్‌ బంద్‌ కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఐ(ఎం), సీపీఐ, తదితరల పార్టీల నాయకులు ఆందోళనకు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఐ(ఎం), సీపీఐ నాయకులను అరెస్ట్‌ చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, అలాంటి ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. టీఎస్‌ పీఎస్సీ చైర్మెన్‌ను బోర్డు సభ్యులను తొలగించాలనీ, కమిషన్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ పోస్టుల సంఖ్యను 13,500 లకు పెంచాలని, పరీక్షల రద్దుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పట్టని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌. రాజు, పానుగంటి పర్వతాలు, పి. రఘు, చెన్నయ్య, బీఎస్పీ నియోజకవర్గ అధ్య క్షులు దొడ్డి శ్రీనివాస్‌, శ్రీకాంత్‌రెడ్డి, సుధీర్‌, ఈశ్వర్‌ నాయక్‌, శ్రీనునాయక్‌, బొబ్బిలి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love