తెలివిగా చదువుకోవడం

పరీక్షలు సమీపిస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. అధ్యయన ప్రణాళిక, సమయ-నిర్వహణ చిట్కాలను అనుసరిస్తే పరీక్షలు మరింత తేలికగా రాయగలరు. పరీక్ష ప్రిపరేషన్‌ను మెరుగుపరచి, ఒత్తిడిని తగ్గించి, పరీక్షలకు సిద్ధం కావడానికి కొన్ని అధ్యయన పద్ధతులున్నాయి.
తెలియని పదాన్ని బాగా తెలిసిన చిత్రానికి లింక్‌ చేసుకోవడం ద్వారా సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఉదాహరణకు ఇటలీ బూట్‌ ఆకారంలో ఉందని, వివిధ ప్రాంతాలు, నగరాలు ల్యాండ్‌మార్క్‌ల ఆధారంగా గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది.
ఒక పదమో, వాక్యమో గుర్తుంచుకోడానికి ఉపయోగపడేది అక్షరాల కలయిక. ఒక మిశ్రమ పదజాలంలోని ప్రతి పదంలోని మొదటి అక్షరాన్ని కలపడం ద్వారా సులభంగా గుర్తుంచుకునే వీలుంది. దిక్సూచిపై ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర ఏ క్రమంలో కనిపిస్తుందో గుర్తుంచుకోవడానికి ఉపయోగించే ప్రాథమిక సూత్రం ఉన్నట్లే ప్రతి విషయానికీ ఒక ప్రాథమిక సూత్రం గుర్తుంచుకుంటే చాలు.
పోల్చి చూసుకోవడం
చిన్న వయస్సులో పదాల స్పెల్లింగ్‌ ఎలా నేర్చుకున్నారో ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వొచ్చు. చూడకుండా రాసి, చెక్‌ చేసుకోవడం వంటివి చేయడం ద్వారా త్వరగా గుర్తుంటాయి. ఇది ప్రాథమిక స్థాయిలో ఉపయోగించే సాధారణ పద్ధతి అయినా సరే, ఇది ఉపయోగకరమైన అధ్యయన సాధనం.సబ్‌హెడింగ్‌ చూసి నిర్వచనం చూడకుండా చెప్పడం, రాయడం ప్రాక్టీస్‌ చేస్తే పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. రివిజన్‌ టైంలో పోర్షన్‌ త్వరగా కంప్లీట్‌ అవుతుంది కూడా.
స్టోరీ టెల్లింగ్‌
స్టోరీ టెల్లింగ్‌లా చదవడం వల్ల సమాచారాన్ని బహుశా ఎప్పటికీ మరచిపోలేరు. అంటే భావం అర్ధం ఇది ఎందుకు? ఎలా జరిగింది? వంటి ప్రశ్నలు వేసుకుంటూ చదివితే పాఠాలు దీర్ఘకాలం గుర్తుంటాయి. ఉదాహరణకు బోరింగ్‌ సబ్జెక్టో, పాఠమో అయితే దాన్ని మీకు నచ్చిన ఏదైనా ఇంట్రస్టింగ్‌ స్టోరీతో పోల్చుకుంటూ చదవాలి. అదే స్టోరీని ఇతరులకు చెప్తే, ఇక ఆ లెసన్‌ ఎప్పటికీ గుర్తుంటుంది. క్లాస్‌లో టీచర్‌ కూడా కొన్నిసార్లు వేరే స్టోరీతో పోల్చి చెప్పడం గుర్తుంది కదా… అలా టీచర్‌ చెప్తున్నప్పుడు వీలైతే రికార్డ్‌ చేసుకుని అర్ధం కాని వాటిని మళ్లీ వినొచ్చు కూడా. నిర్దిష్ట నిబంధనలు, ఆలోచనలను సరిపోల్చడానికి సారూప్యతను ఉపయోగించవచ్చు. అనేక రకాల సారూప్యతలు ఉన్నాయి. మొత్తం భాగాలతో సహా, బ్యాటరీ ఒక ఫ్లాష్‌లైట్‌కి కీబోర్డ్‌గా కంప్యూటర్‌కు ఉంటుంది. కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్‌ సారూప్యతలు కూడా సాధారణం. ఉదా: ధూమపానం క్యాన్సర్‌కి, వ్యాయామం బరువు తగ్గడానికి వంటివి. సొంతంగా ఎగ్జాంపుల్స్‌ని క్రియేట్‌ చేసుకోగలిగినా, ఇప్పటికే కంటెంట్‌లో ఉన్న వాటిని గుర్తించడం తేలిక.
అభ్యాస పరీక్షలు – సమాధానాలు
ఎగ్జాంపుల్స్‌ ఎక్కువ చేయడం వల్ల దేనిలోనైనా నైపుణ్యం పెరుగుతుంది. టీచర్‌ ఇచ్చిన మోడల్‌ ప్రశ్నాపత్రాలు పూర్తిచేయాలి. దీనివల్ల సమస్యలను ఎలా పరిష్కరించాలో, సమర్థవంతమైన సమాధానాలను ఎలా రాయాలో అర్ధమవుతుంది. ఫైనల్‌ పరీక్షను పూర్తి చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందో కూడా తెలియజేస్తుంది. మోడల్‌ ఎగ్జామ్‌ లేకపోతే వర్క్‌షీట్స్‌ సాధన చేయాలి. ఈ పద్ధతులు అందరికీ పనిచేసినప్పటికీ, కొంతమందికి మాత్రం ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
వివిధ రకాల కోర్సుల కోసం విభిన్న పద్ధతులను ప్రయత్నించండి, ఎందుకంటే సైన్స్‌ కోర్సు చదవడానికి, ఇంటెన్సివ్‌ కోర్సు నేర్చుకోడానికి తేడా వుంటుంది. ఉదా: అనాటమీ కోర్సు రిపీటెడ్‌గా చదవాలి, చరిత్రను కథ రూపంలో చదవాలి. ఏ సబ్జెక్ట్‌ ఎలా చదవాలో వివేచన, అభ్యాస శైలిని బట్టి వుంటుంది. బొమ్మలు, చార్ట్‌లు, గ్రాఫ్‌ల ద్వారా కూడా కొన్ని గుర్తుంచుకోవచ్చు.
విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కి నిర్ధిష్ట సమయాన్ని కేటాయించాలి. షెడ్యూల్‌ వేసుకోవాలి. ఇందులో క్విజ్‌లు, పరీక్షలు, ప్రాజెక్ట్‌లు, వాటి గడువులు ఉండాలి.
అధ్యయన ప్రణాళిక ఎందుకు?
ప్రతివారికీ టైంటేబుల్‌ పాటించడం ఒక సవాల్‌. క్లాస్‌లతోపాటు, ఇతర కార్యకలాపాలు కూడా వుంటాయి. టైం టేబుల్‌, షెడ్యూల్‌ వేసుకోవడం వల్ల టైం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది. హోంవర్క్‌, అసైన్‌మెంట్‌, పరీక్షల ప్రిపరేషన్‌… అన్నింటికీ తగిన సమయాన్ని కేటాయించాలి. ఆన్‌లైన్‌ స్టడీకి ఈ ప్లానింగ్‌ ఇంకా ముఖ్యం. ఎందుకంటే టీచర్‌ రిమైండర్‌ ఉండదు.

– డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love