వేల్పుర్ మండల కేంద్రంలో కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆషాఢ బోనాల కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న సునీల్ కుమార్ కు ఆలయ పూజారి అమ్మవారి ఆశీర్వచనాలను, తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆషాడ బోనాల కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ కుమార్ ను కౌండిన్య గౌడ సంఘం సభ్యులు శాలువాతో సత్కరించారు. వర్షాలు బాగా కురిసి, పంటలు సమృద్ధిగా పండి, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా సునీల్ కుమార్ తెలిపారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.