
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. దశరథ రామయ్య వారి ప్రోత్సాహముతో భువనగిరి బార్ అసోసియేషన్ వారు కోర్టులో రోజు దాదాపుగా అనేక మంది కక్షిదారులు తమ కేసులలో హాజరు అవుతున్నందున వారికి ఇప్పుడు ఉన్న మంచినీటి సదుపాయం సరిపోని కారణమున చౌటుప్పల్ లోని దీవిస్ కంపని వారిని మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని బార్ అసోసియేషన్ కోరినందున దీవిస్ కంపని వారు దానికి సమ్మతించి కోర్టు ఆవరణలో గంటకు 1000 లీటర్ల కెపాసిటితో ఆర్. ఒ ఫిల్టర్ మంచి నీటి సదుపాయాన్ని కల్పించటానికి అంగీకరించి బుధవారం కోర్టు ఆవరణలో భూమిపూజను యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె. దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి సి. హెచ్. రాజశేఖర్ రెడ్డి, దివిస్ మేనేజర్ కిషోర్ కుమార్ మరియు శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ దాహర్తిని తీర్చడం ఒక గొప్ప సేవ అని తెలిపారు.