గడ్డం వంశీని ఆదరించి ఓటు వేసి పార్లమెంటుకు పంపండి

నవతెలంగాణ – ముత్తారం: ముత్తారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని స్టానిక ప్రజలను కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నామని, ఐదు న్యాయాలతో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల గురించి ఆలోచించి, వారి సంక్షేమం కోసం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, నాయకత్వంలో మంథని నియోగ వర్గం అభివృద్ధి కోసం, యువత ఉద్యోగ అవకాశాల హామీ ఇస్తున్నా గడ్డం వంశికృష్ణ ను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ తాటిపాములవాకులరాణి శంకర్ సీనియర్ నాయకులు బొల్లినేని బుచ్చం రావు, నాయకులు మల్యాల రాజయ్య నగేష్ ఇనుముల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love