
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసమే పని చేస్తుందని రైతు పండించిన పొద్దు తిరుగుడు పంటకు క్వింటాలుకు మద్దతు ధర రూ.6760 ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు తెలిపారు. మద్నూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయ ఆవరణంలో పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొద్దు తిరుగుడు పంట రైతులు మద్దతు ధర కేంద్రాన్ని సద్వినియోగం పరుచుకోవాలని కోరారు. మద్దతు ధర కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ వైస్ చైర్మన్ శంకర్రావు సింగిల్ విండో కార్యదర్శి బాబురావు సింగిల్ విండో డైరెక్టర్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ విటల్ మండల వ్యవసాయ అధికారి రాజు స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.