ఆదర్శవంత రాజకీయ సాహితీవేత్త సురవరం ప్రతాప రెడ్డి

– మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ-కల్చరల్‌
రాజకీయాలలో గానీ సాహిత్యం వ్యాసంగం లో కానీ సంస్కారవంత విమర్శలు ఉండాలని రాజకీయ సాహితీవేత్తల జీవితాలు ఇతరులకు మార్గ దర్శనం కావాలని కోరుకున్న సురవరం ప్రతాప రెడ్డి నేటి వారికి అదర్శనీయులని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస గౌడ్‌ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో సురవరం ప్రతాప రెడ్డి 127 వ జయంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రతాప రెడ్డి రాజకీయాల లో కోన సాగి ఉంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్య మంత్రి అయ్యే వారని మంచి సంస్కరణలు ప్రవేశ పెట్టేవారని అన్నారు. అంబేడ్కర్‌ , చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మెహనీయులు సమాజం కోసం పరి తపించారన్నారు. విలువల కోసం జీవిత కాలం ప్రాకు లాడారని తెలిపారు. నేడు రాజకీయాల లో వ్యక్తిగత దూషణలు సర్వ సాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్లూరి శివా రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగు విశ్వవి ద్యాలయం కు ప్రతాప రెడ్డి నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతాప రెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘీక చరిత్ర గొప్ప పరిశోధన గ్రంథం అన్నారు. అనంతరం ప్రతాప రెడ్డి సాహితీ వైజయంతి పురస్కారం ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కసి రెడ్డి వెంకట రెడ్డికి లక్ష నగదు తో జ్ఞాపిక ప్రశంసాపత్రం బహు కరించారు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య స్వాగతం పలికిన సభలో కార్య దర్శి సురవరం పుష్పలత రెడ్డి, డాక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ రెడ్డి, కపిల్‌,చరిత్ర పరిశోధకుడు శివనాగి రెడ్డి పాల్గొన్నారు.

Spread the love