సూర్య దినపత్రిక మండల రిపోర్టర్‌ లింగంకు పితృవియోగం

– పరామర్శించిన సీపీఐ(ఎం), బీఅర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని నోముల గ్రామంలో సూర్య దినపత్రిక మండల రిపోర్టర్‌ ఎర్ర లింగం తండ్రి ఎర్ర పోచయ్య ఆదివారం మృతి చెందారు. సోమవారం సీపీఐ(ఎం), బీఅర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎర్ర పోచయ్య మృదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి లింగంను పరామర్శించారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీని వాస్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అశోక్‌, కాంగ్రెస్‌ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, బీఅర్‌ఎస్‌ మండలాధ్యక్షులు చీరాల రమేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ దండేటికార్‌ రవి, నాయకులు చింతకింది చక్రపాణి, కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఏర్పుల రాజు, నాయకులు ఏర్పుల సంజీవ, ఎంపీటీసీ పల్లాటి జయనందం సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సిలివేరు రాజు, ఎండీ ఫయాస్‌, గ్రామశాఖ కార్యదర్శి మాదరమోని గణేష్‌, బీఅర్‌ఎస్‌ గ్రామాధ్యక్షులు గంట హనుమంతు, బీఅర్‌ఎస్‌ వార్డు సభ్యులు చింతకింది వీరేశ్‌, సీపీఐ(ఎం) వార్డు సభ్యులు ఈరమళ్ల శివ కుమార్‌ తదితరులున్నారు.

Spread the love