బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్ :
యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామంలోనీ గురువారం, బీ ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు దొంతిసరం శంకర్, పిఎసిఎస్ డైరెక్టర్ గడ్డమిది శ్రీనివాస్ లు బీ ఆర్ ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కర్రే వెంకటయ్య వారిద్దరినీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, ఆలేరు నియోజకవర్గ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మిట్ట వెంకటయ్య,  మా రెడ్డి కొండల్ రెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love