ప్రీ క్వార్టర్స్‌లో స్వైటెక్‌

Switek in the pre-quarters– మియామి ఓపెన్‌ 2025
మియామి (యుఎస్‌ఏ): మాజీ చాంపియన్‌, స్టార్‌ ప్లేయర్‌ ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) మియామి ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. బెల్జియం అమ్మాయి ఎలిసె మెర్టెన్స్‌పై 7-6(7-2), 6-1తో స్వైటెక్‌ వరుస సెట్లలో విజయం సాధించింది. ఆరు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన స్వైటెక్‌ పాయింట్ల పరంగా 78-63తో పైచేయి సాధించింది. ఇండియన్‌వెల్స్‌ ఓపెన్‌ విజేత మిర్రా అండ్రీవ (రష్యా) 6-7(5-7), 6-2, 3-6తో అమెరికా అమ్మాయి చేతిలో ఓటమిపాలైంది. నాల్గో సీడ్‌ పెగులా 6-7(3-7), 6-2, 7-6(7-2)తో అనాపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో నొవాక్‌ జకోవిచ్‌ 6-1, 7-6(6-1)తో అర్జెంటీనా ఆటగాడిపై అలవోక విజయం సాధించాడు. కాస్పర్‌ రూడ్‌ 6-4, 7-6(7-4)తో.. మోన్‌ఫిల్స్‌ 7-5, 5-7, 7-6(7-1)తో గెలుపొంది ముందంజ వేశారు.

Spread the love