
నవతెలంగాణ – అశ్వారావుపేట
దొంతికుంట చెరువు ఆయకట్టు లో కొందరు వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్ లు వేయడంతో వాటి దిగువన రైతులు ఇబ్బందులు పడుతున్నామని,ఈ ఆక్రమణలు పై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు ఆయకట్టు రైతులు పలువురు సోమవారం పిర్యాదు చేసారు. దొంతికుంట ఆయకట్టు దారుల్లో ఒకరైన చీమకుర్తి పాండు కుమారుడు శ్రీక్రిష్ణ తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర నేరుగా మార్చి లేఅవుట్ లు గా చేసి మెరక గా తయారు చేయడంతో పంట కాలువలు పూడి పోయి దాని దిగువ పొలాలకు నీరు అందక సాగు దారులు నష్టపోతున్నారని చెన్నూరి రామక్రిష్ణ,సురేష్,వెంకట నర్సమ్మ,రామచంద్రరావు లు ఫిర్యాదులో పేర్కొన్నారు.