– సీఎం రేవంత్, మంత్రి దామోదరకు ఐఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోరింది. ఈ మేరకు బుధవారం ఐఎంఏ బంజారాహిల్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ చల్లగాని ప్రభుకుమార్, ఇతర నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ నెలలో హైదరాబాద్ లో జరగనున్న ఐఎంఏ సమావేశాలకు సీఎంతో పాటు దామోదర రాజనర్సింహను ఆహ్వానించారు. అనంతరం ప్రభుకుమార్ మాట్లాడుతూ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం, వైద్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.మన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. దేవాలయానికి, పర్యావరణానికి హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.