జిల్లా స్థాయి క్రీడల్లో వెంకట సాయి విద్యార్థుల ప్రతిభ 

నవతెలంగాణ నసురుల్లాబాద్ 
జిల్లా స్థాయిలోఅథ్లెటిక్స్ క్రీడ పోటీల్లో నసురుల్లాబాద్ మండల కేంద్ర శ్రీ వెంకట సాయి హైస్కూల్ విద్యార్థులు  ప్రతిభ చూపినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శివ కుమార్ తెలిపారు. మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో  400 ,200.100 మీటర్ల పరుగు పందెం విభాగంలో ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. ఇందులో విద్యార్థినిలు సోనా, అంజలి, చందన, మానస,లకు ఉపాధ్యాయు బృందం  అభినందించారు.  శ్రీ వెంకట సాయి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి ఇలాంటి పథకాలు మరెన్నో రావాలని ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, ఘని, తదితరులు ఉన్నారు.
Spread the love