తమిళ్‌ తలైవాస్‌ భారీ విజయం

Tamil Thalaivas is a huge success– 44-25తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపు
– ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11
నవతెలంగాణ-హైదరాబాద్‌: తమిళ్‌ తలైవాస్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. గుజరాత్‌ జెయింట్స్‌ను 44-25తో చిత్తు చేసి ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో తమిళ్‌ తలైవాస్‌ ఘన విజయం నమోదు చేసింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ అదరగొట్టింది. సీజన్‌లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. తలైవాస్‌ స్టార్‌ రెయిడర్‌ నరేందర్‌ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్‌ (5 పాయింట్లు), డిఫెండర్‌ నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు), ఆమీర్‌ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆటగాళ్లలో గుమన్‌ సింగ్‌ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్‌ మూడు పాయింట్లతో మెరిశాడు. పీకెఎల్‌ 11లో నాలుగు మ్యాచుల్లో గుజరాత్‌ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం.

Spread the love