– మైదానంలో కుప్పకూలిన బంగ్లా స్టార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) మ్యాచ్‌లో గుండెపోటుకు గురయ్యారు. డీపీఎల్‌లో మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్న తమీమ్.. ఓ ఓవర్ ఫీల్డింగ్ చేసిన అనంతరం గుండెనొప్పితో మైదానం వీడాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా తమీమ్‌కు అత్యవసరంగా ఏంజియోప్లాస్టీ హృదయ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అయినా కరోనరీ కేర్ యూనిట్ (సీసీయు) పర్యవేక్షణలో ఉంచారని… కుటుంబ సభ్యులు, సహచర క్రికెటర్లతో మాట్లాడినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వర్గాలు తెలిపాయి.