తంగళ్ళపల్లి, శనిగరం పాఠశాలలకు సామాగ్రి అందజేత

నవతెలంగాణ-కోహెడ: కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి, శనిగరం ప్రాథమిక పాఠశాలలకు బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ వారి సౌజన్యంతో రాజేంద్ర పాండే ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్కొక్క పాఠశాలకు సుమారు 30 వేల రూపాయల విలువ గల 10 బజాజ్ సీలింగ్ ఫ్యాన్లు, 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ప్లేయింగ్ మెటీరియల్, స్టడీ మెటీరియల్ ను అందజేశారు. రెండు పాఠశాలలకు కలిపి సుమారు 60 వేల రూపాయల విలువ చేసే సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాలకు ఉపయోగపడే సామాగ్రి ని అందజేయడం అభినందనీయమన్నారు.
పాఠశాలకు సామాగ్రి వచ్చేందుకు కృషి చేసిన పుప్పాల గోపాలకృష్ణ, బండమీది రాజమౌళి, పాము శ్రీకాంత్ లకు పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో పాము జగదాంబ స్మారక ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు పాము శ్రీకాంత్, బండమీది రాజమౌళి, ప్రధానోపాధ్యాయులు వి.చంద్రశేఖర్, ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, ఆర్. శైలజ, టి.సత్యనారాయణ, టి.శైలజ, మమత, సుమలత, ఎస్ఎంసి చైర్మన్ చుక్క సురేష్, బి.రేఖ, సి ఆర్ పి రాజేశం, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love